Akkineni Heroes : ఒకే వేదికపైకి ముగ్గురు అక్కినేని హీరోలు.. లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం.. కానీ..

Akkineni Heroes: తాజాగా లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం పేరుతో మరో ఈవెంట్ చేస్తున్నారు.

  • Updated on- July 20, 2026 / 04:33 PM IST

Three Akkineni Heroes Attending Lenin Block Buster Vaibhavam

Akkineni Heroes : ఇటీవల అఖిల్ లెనిన్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటిసారి అఖిల్ హిట్ కొట్టడంతో అభిమానులు, టాలీవుడ్ సంతోషం వ్యక్తం చేసారు. ఇప్పటికే రెండు సక్సెస్ మీట్స్ నిర్వహించగా తాజాగా లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం పేరుతో మరో ఈవెంట్ చేస్తున్నారు.

లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్ నేడు సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. ఈ ఈవెంట్ కి లెనిన్ హీరో అఖిల్ తో పాటు నాగార్జున, నాగచైతన్య కూడా రాబోతున్నారు. చాన్నాళ్ల తర్వాత ముగ్గురు అక్కినేని హీరోలు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. దీంతో ఈ ఈవెంట్ కోసం అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also Read : Princce Cecil : కాబోయే భార్యని పరిచయం చేసిన నటుడు ప్రిన్స్.. మోకాళ్ళపై కూర్చొని రింగ్ తొడిగి.. ఫోటోలు చూశారా..?

అయితే ఈ ఈవెంట్ మీడియా ముందు, భారీగా ఫ్యాన్స్, జనాల మధ్య కాకుండా కేవలం కెమెరాల ముందు చేస్తున్నారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ వేసి కేవలం లైవ్ కెమెరాలు పెట్టి ఈ ఈవెంట్ ని ఎవరూ లేకుండానే నిర్వహిస్తున్నారని, ఆ లైవ్, ఈవెంట్ ఫోటోలు అందరికి టెలికాస్ట్ కి ఇస్తారని తెలుస్తుంది. ఇలా ముగ్గురు హీరోలు వస్తుంటే భారీగా ఫ్యాన్స్ మధ్య చేయొచ్చుగా, సినిమాకు కూడా ఇంకా రీచ్ ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.