Peddi Ticket Prices: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెంపు.. ప్రీమియర్ షోస్ కి గ్రీన్ సిగ్నల్

Peddi Ticket Prices: పెద్ది (Peddi)సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించిన తెలంగాణ సర్కార్.

Ticket prices hiked for Ram Charan Peddi movie in Telangana.

  • తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు.
  • ప్రీమియర్ షో టికెట్ రూ. 600.
  • పది రోజుల పాటే కొత్త ధరలు.

Peddi Ticket Prices: పెద్ది మూవీ టీం కి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాల టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం, చిత్ర యూనిట్ అభ్యర్థన మేరకు ప్రీమియర్ షోల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రీమియర్ షోల టికెట్ గరిష్ట ధరను రూ.600 రూపాయలుగా ఖరారు చేశారు.

*Vishnu Vishal: ఫ్యామిలీతో సింగపూర్ వెకేషన్‌లో విష్ణు విశాల్, జ్వాలా గుత్తా.. క్యూట్ పిక్స్ వైరల్

ఇక సాధారణ ప్రదర్శనల విషయానికి వస్తే… సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.100 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై రూ.125 రూపాయల వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ఈ పెంచిన భారీ టికెట్ ధరలు సినిమా విడుదలైన రోజు నుండి కేవలం మొదటి పది రోజుల పాటు మాత్రమే ఈ పెరిగిన ధరలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత యథావిధిగా పాత ధరలకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. పెద్ద సినిమాల భారీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకునే. దీంతో, పెద్ది చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఇక పెద్ది(Peddi) సినిమా విషయానికి వస్తే, ఉప్పన లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా కావడంతో పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.