Raviteja : లండన్ బయలుదేరిన మాస్ మహారాజ్ రవితేజ.. ఎందుకో తెలుసా..?
మాస్ మహారాజ రవితేజ నేడు యూరప్ బయలుదేరాడు. ఏ పని మీద అక్కడికి వెళ్ళాడో తెలుసా..?
- gum 95921
- Published On : August 21, 2023 / 03:42 PM IST
Tiger Nageswara Rao Raviteja off to europe for Eagle movie shooting
Raviteja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుత మూవీ లైనప్ చూస్తుంటే ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతర ఉండబోతుందని అర్ధమవుతుంది. ప్రెజెంట్ రవితేజ చేతిలో ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao), ఈగల్ (Eagle), RT4GM సినిమాలు ఉన్నాయి. వీటిలో టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ చివరిదశలో ఉంది. ఇక గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమా సెప్టెంబర్ ఎండ్ లేదా, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఈగల్ విషయానికి వస్తే.. ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది.
Rashmi Gautam : అమ్మాయిల హార్ట్ బ్రేక్స్ పై సినిమాలు కావాలంటున్న రష్మీ.. సుధీర్‌తో ప్రేమ బ్రేకప్..!
ఇక ఈ షెడ్యూల్ కోసమే రవితేజ లండన్ బయలుదేరాడు. అక్కడ లొకేషన్స్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని సమాచారం. కాగా ఈ సినిమాని అనౌన్స్ చేస్తూనే రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ లో మూవీ పై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. కార్తికేయ 2 తో పాటు రవితేజ సినిమాలు ధమాకా, డిస్కో రాజా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన కార్తీక్.. దర్శకుడిగా పరిచయం అవుతూ ఈగల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుంది.
Salman Khan : సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూశారా? గుండు బాస్.. షారుఖ్ లాగే సినిమా కోసమో?
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక టైగర్ నాగేశ్వరరావు నాగేశ్వరరావు రిలీజ్ విషయానికి వస్తే.. అక్టోబర్ 20న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 19’s కాలంలో స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది.
