Ganapath : దసరా రేసులో మరో పాన్ ఇండియా సినిమా.. విజయం ఎవరిది..?
ఈసారి దసరాకు పెద్ద సినిమాల సందడి గట్టిగా ఉండబోతుంది. టాలీవుడ్ టు బాలీవుడ్ పాన్ ఇండియా చిత్రాలు..
- gum 95921
- Published on- September 18, 2023 / 02:57 PM IST
Tiger Shroff Ganapath is ready to be release in Dussehra
Ganapath : ఈ ఏడాది దసరాకు పెద్ద సినిమాల సందడి గట్టిగా కనిపిస్తుంది. ఇప్పటికే మూడు పాన్ ఇండియా సినిమాలు రేసులో నిలవగా.. తాజాగా మరో పాన్ ఇండియా చిత్రం వచ్చి నిలిచింది. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటిస్తున్న ‘గణపత్’ దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. వికాస్ బాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి పార్ట్.. ‘ఏ హీరో ఈజ్ బార్న్’ అనే ట్యాగ్ లైన్ తో రాబోతుంది. యాక్షన్ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతి సనన్ (Kriti Sanon) హీరోయిన్ గా నటిస్తుంటే అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గుడ్ కో పూజా ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుంది. కాగా దసరా రేసులో ఇప్పటికే రవితేజ – ‘టైగర్ నాగేశ్వరరావు’, విజయ్ ‘లియో’, శివ రాజ్ కుమార్ ‘ఘోస్ట్’ వంటి పాన్ ఇండియా చిత్రలు రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసుకొని ఉన్నాయి. లియో, ఘోస్ట్ సినిమాలు అక్టోబర్ 19న రిలీజ్ కాబోతున్నాయి. ఇక టైగర్ నాగేశ్వరరావుతో పాటు ఇప్పుడు ఈ గణపత్ 20న విడుదల కానున్నాయి.
Dhanush : షూటింగ్లో బిజీగా ఉన్నా అసిస్టెంట్ పెళ్ళికి వచ్చిన ధనుష్.. D50 లుక్ ఇదేనా?
వీటితో పాటు బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ కూడా దసరాకే రాబోతుంది. ఈ మూవీ దసరాకి రావడం అంటూ రెండు రోజులు నుంచి గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేడు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు. ముందుగా చెప్పినట్లు భగవంత్ కేసరిని అక్టోబర్ 19నే ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈ ఐదు చిత్రాల్లో ఏది విజయం అందుకుంటుందో, ఏది విఫలం అవుతుందో చూడాలి.
