NTR30: కత్తి పట్టి మరీ ముహూర్తం ఫిక్స్ చేసిన తారక్!
ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లో రాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత చేయబోయే...
- Anil Aaleti
- Published On : May 19, 2022 / 04:19 PM IST
Time Fixed For Ntr30 Massive Update
NTR30: ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లో రాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత చేయబోయే సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ సినిమా నుండి అదిరిపోయే అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే రేపు(మే 20) తారక్ పుట్టినరోజు కావడంతో, ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఇవాళ సాయంత్రం రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
NTR30: మే 20 తారక్ బర్త్ డే.. అదే రోజున కొరటాల మూవీ కంప్లీట్ డిటైల్స్!
తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఎన్టీఆర్ 30వ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో కొరటాల శివ, తారక్ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో సెట్ కావడంతో ఈసారి ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే తారక్ ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కానీ కొరటాల శివ మాత్రం చిరంజీవితో ఆచార్య చిత్రాన్ని తెరకెక్కించి తొలి ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్నాడు.
NTR30: కొత్త సినిమా మొదలెప్పుడు తారక్.. అభిమానుల ఆవేదన!
ఇక ఆచార్య చిత్ర ప్రమోషన్స్ సమయంలో తారక్‌తో చేయబోయే సినిమా గురించి కొరటాల చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఇలాంటి స్క్రిప్టు రాలేదని.. ఇది సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఆయన అన్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇవాళ సాయంత్రం 7.02 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ పోస్టర్‌లో హీరో రక్తపు మరకలు ఉన్న కత్తిని చేతిలో పట్టుకుని ఉన్నట్లుగా మనకు చూపించారు. దీంతో ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌తో రాబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. మరి తారక్ 30వ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఏమిటో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
The Lightning is all set to strike ⚡
Most awaited #NTR30 update at 7:02 PM Today ?
Stay tuned!@tarak9999 #KoratalaSiva @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/txPAPrs15W
— NTR Arts (@NTRArtsOfficial) May 19, 2022
