Lathish : విలన్ గా నటించడం కోసం ఏకంగా 30 కిలోలు బరువు పెరిగి.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు..
తాజాగా లతీష్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. (Lathish)
- Saketh U
- Updated on- May 3, 2026 / 07:20 PM IST
Lathish
Lathish : ఇటీవల కిరణ్ అబ్బవరం నిర్మాతగా దాదాపు 50 మంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాని తెరకేకించిన సంగతి తెలిసిందే. టీవీ వచ్చిన కొత్తలో ఓ పల్లెటూరులో జరిగిన కథతో సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో విలన్ గా నెగిటివ్స్ షేడ్స్ తో సిద్ధయ్య అనే పాత్రలో యాక్టర్ లతీష్ నటించి మెప్పించాడు. తాజాగా లతీష్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
నటుడు లతీష్ తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్తూ.. మాది నగరిలో వ్యవసాయ కుటుంబం. చాలా కష్టపడి నన్ను చదివించారు. బెంగుళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేశాను. 2017 నుంచి సినిమాల్లో ప్రయత్నిస్తున్నాను. అసిస్టెంట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, యాక్టర్ గా.. ఏది దొరికితే అది చేసుకుంటూ వచ్చాను. సినిమాల్లోకి వచ్చానని తెలిసి మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేసాడు. షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి కూడా డబ్బులు లేక చాలా కష్టాలు పడ్డాను అని తెలిపాడు.
Also See : Anchor Sravanthi : ఆకుపచ్చని హాఫ్ శారీలో.. స్రవంతి సందడి.. ఎంత క్యూట్ గా ఉందో..
తిమ్మరాజుపల్లి టీవీలో అవకాశం గురించి చెప్తూ.. బీ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ కోసం లక్ష రూపాయలు అడిగారు. డబ్బులున్న వాళ్లకే ఈ యాక్టింగా అని నేను అడగడంతో నా కమిట్మెంట్ చూసి నా దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ ఉంటూ చాలా నాటకాలు వేసాను. తిమ్మరాజు పల్లి టీవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడే ఆడిషన్ చేసి తీసుకున్నారు. ఒకప్పుడు విలన్‌గా నటించిన వాళ్లే తర్వాత పెద్ద హీరోలు అయ్యారు. అందుకే విలన్ పాత్ర అనగానే ఒప్పుకున్నాను. ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ ముప్పై కిలోలు పెరిగాను. సిద్దయ్య పాత్రలో నన్ను చూసి అది నువ్వేనా అని అడుగుతుంటే పాత్ర కోసం నేను పడ్డ కష్టం సంతృప్తి ఇచ్చింది అని తెలిపారు.
అలాగే.. సినిమా చూసి కిరణ్ అబ్బవరం నన్ను, ప్రదీప్ అన్నని బాగా మెచ్చుకున్నారు. బయట ఇంత సైలెంట్ గా ఉంటావు, స్క్రీన్ మీద అలా కనిపించావ్ ఏంట్రా అని ఆశ్చర్యపోయారు. నరేష్ అగస్త్య, మా బషీర్ సార్, పలువురు సినీ ప్రముఖులు మెచ్చుకున్నారు. నాకు యాక్టింగ్ నేర్పించిన మా బషీర్ సర్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లిన తరువాత నా గురించి చెప్పి నన్ను హగ్ చేసుకున్నారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం బీ స్టూడియోలో పార్ట్ టైంగా పని చేస్తూనే కథలు వింటున్నాను. త్వరలోనే కొత్త సినిమాలు ఓకే చేస్తాను అని తెలిపారు.
Also See : Raviteja Daughter : రవితేజ కూతురు మోక్షద లేటెస్ట్ ఫొటోలు చూశారా..? హీరోయిన్స్ ని మించి..
