Tollywood Hero: ఒకప్పటి యాక్షన్ హీరో.. ఇప్పుడు ఇలా మారిపోయాడు.. వీడియో చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్
టాలీవుడ్(Tollywood Hero) సీనియర్ హీరో భాను చందర్ లేటెస్ట్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
- V Santhosh Kumar
- Published on- May 5, 2026 / 07:01 PM IST
Tollywood Action Hero Bhanu Chander latest video goes viral in social media
- వైరల్ అవుతున్న భానుచందర్ కొత్త రూపం.
- పూర్తిగా మారిన యాక్షన్ హీరో లుక్.
- అభిమాని కోసం ప్రత్యేక వీడియో సందేశం.
Tollywood Hero: తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన భానుచందర్(Tollywood Hero) గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు పోటీనిస్తూ అనేక విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించారు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, సహాయ నటుడిగానూ తనదైన ముద్ర వేసిన ఆయన, ప్రస్తుతం 70 ఏళ్లు పైబడిన వయసులో అరుదుగా వెండితెరపై కనిపిస్తున్నారు.
Mohan Babu: ఆ బాధ జీవితాంతం ఉంటుంది.. మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్
తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమలాపురానికి చెందిన ప్రముఖ వంట మాస్టర్ చిట్టిబాబు వివాహ వార్షికోత్సవం సందర్భంగా భానుచందర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయన నెరిసిన జుట్టు, తెల్లటి గడ్డంతో పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న ఈ యాక్షన్ స్టార్‌ను గుర్తుపట్టడం కష్టంగా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రూపం మారినప్పటికీ, భానుచందర్ మాటల్లోని గాంభీర్యం మాత్రం అలాగే ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2022లో వచ్చిన ‘శాకిని డాకిని’, 2024లో విడుదలైన ‘రామ్’, ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. వయసు రీత్యా వచ్చిన ఈ మార్పు సహజమేనని, ఇప్పటికీ ఆయన వాయిస్ బేస్ వింటే పాత భానుచందర్ గుర్తుకొస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.
