Movie Budget : కొంప ముంచుతున్న ఫేక్ బడ్జెట్స్..!

కొంప ముంచుతున్న ఫేక్ బడ్జెట్స్ (Movie Budget ) ఇండస్ట్రీలో ఇప్పుడది హాట్ టాపిక్‌గా మారింది.

Tollywood and bollywood Movie Budget And Collections

Movie Budget : కొంప ముంచుతున్న ఫేక్ బడ్జెట్స్.. ఇండస్ట్రీలో ఇప్పుడది హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడు ఇది పెద్ద చర్చగా మారుతోంది. సినిమా కోసం పెట్టే బడ్జెట్ ఒకటైతే.. బయటికి చెప్పేది మాత్రం ఇంకో బడ్జెట్. ఇదో ట్రెండ్ అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

అసలు సినిమా బడ్జెట్ కంటే, బయటకు చెప్పే ఫిగర్ మాత్రం భారీగా ఉండటంతో సినిమాపై ఆడియన్స్‌కు ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. రిలీజ్ తర్వాత ఆ రేంజ్‌లో క్వాలిటీ కనిపించకపోవడంతో ఇంత బడ్జెట్ పెట్టి ఇదేనా అవుట్‌పుట్.? అనే నెగెటివ్ టాక్ వెంటనే స్టార్ట్ అవుతోందట.

Lenin Twitter Review : ‘లెనిన్’ ట్విట్ట‌ర్ రివ్యూ.. అక్కినేని అఖిల్ ఊర మాస్ పర్ఫార్మెన్స్..!

ఇప్పటికే బాలీవుడ్‌లో రామాయణ్ మూవీకి రూ.4 వేల కోట్ల బడ్జెట్ అంటూ లీక్స్ రావడం, టాలీవుడ్‌లో మహేష్ బాబు వారణాసి ప్రాజెక్ట్ 1500 కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం జరగడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇలా భారీ బడ్జెట్ అంటూ ప్రచారం జరగడం..రిలీజ్‌కు ముందు బిజినెస్ మీద కూడా ప్రభావం పడుతోందట. రిలీజ్ తర్వాత సినిమా కలెక్షన్స్ మీద కూడా ప్రెజర్ పెరుగుతోందట. చివరికి సినిమా కంటెంట్ కంటే బడ్జెట్ డిస్కషన్ ఎక్కువ అవుతుండటం మేకర్స్‌కే రిస్క్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.