Jailer 2 : టాలీవుడ్‌కి అన్యాయం చేసిన జైలర్ 2 డైరెక్టర్..? నిరాశలో తెలుగు ప్రేక్షకులు..

ఒక్క విషయంలో మాత్రం తెలుగు ప్రేక్షకులు జైలర్ 2 పై నిరాశలో ఉన్నారు. (Jailer 2)

  • Published on- October 16, 2026 / 05:50 PM IST

Jailer 2

Jailer 2 : రజినీకాంత్ జైలర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన జైలర్ 2 నిన్న అక్టోబర్ 15న రిలీజయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చేసింది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం తెలుగు ప్రేక్షకులు జైలర్ 2 పై నిరాశలో ఉన్నారు.

జైలర్ సినిమాలో, ఇప్పుడు పార్ట్ 2 లో అన్ని పరిశ్రమల నుంచి చాలామంది స్టార్స్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అదరగొట్టారు. ఇప్పుడు పార్ట్ 2 లో వేరే భాష్ల నటీనటులు చాలామంది ఉన్నా ముఖ్యంగా కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్, తమిళ్ నుంచి విజయ్ సేతుపతి.. ఇలా స్టార్స్ అంతా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి వారి సీన్స్ లో అదరగొట్టేసారు. ఈ గెస్ట్ అప్పీరెన్స్ లు వచ్చినప్పుడు థియేటర్ లో రెస్పాన్స్ అదిరిపోయింది.

Also Read : Divyabharathi : మధుర మీనాక్షి ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్.. ఫొటోలు..

అన్ని పరిశ్రమల స్టార్ హీరోలు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు కానీ టాలీవుడ్ నుంచి ఒక్క హీరో కూడా లేరు. కనీసం చిన్న సెలబ్రిటీ, నటీనటులు ఎవ్వరూ లేరు. టాలీవుడ్ నుంచి కూడా ఎవరో ఒక హీరోని గెస్ట్ అప్పీరెన్స్ పెట్టొచ్చు కదా అని తెలుగు ప్రేక్షకులు దర్శకుడి పై కామెంట్స్ చేస్తున్నారు. పైగా తమిళ్ తర్వాత మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది మన దగ్గరే.

జైలర్ సినిమాకు బాలయ్య బాబుని అనుకున్నామని కానీ కుదరలేదని దర్శకుడు తెలిపాడు. దీంతో డిజప్పాయింట్ అయినా తెలుగు ఆడియన్స్ పార్ట్ 2 లో అయినా బాలయ్య బాబు గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడేమో అని ఎదురు చూసారు. కానీ నిరాశే మిగిలింది. బాలయ్య బాబు ఒక్క నిమిషం కనిపించినా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం. సినిమాకు టాలీవుడ్ లో మరింత హైప్, కలెక్షన్స్ వచ్చేవి. మరి అలాంటి మాస్ అప్పీరెన్స్ ఛాన్స్ ని దర్శకుడు ఎందుకు వదులుకున్నాడో తెలీదు.

Also Read : Dimple Hayathi : చీరలో మత్తెక్కించే కాటుక కళ్ళతో.. డింపుల్ హయతి ఫొటోలు వైరల్..

అంతమంది గెస్ట్ అప్పీరెన్స్ లని పెట్టినప్పుడు బాలయ్య లేదా టాలీవుడ్ లో ఏ యాక్టర్ ని అయినా పెట్టె స్కోప్ ఉంది కానీ దర్శకుడు తీసుకోలేదు. ఒకవేళ రజినీకాంత్ సినిమా అని అడిగితే టాలీవుడ్ లో ఏ నటుడైనా చేస్తాడు. టాలీవుడ్ లో సినిమాకు ఇంత మార్కెట్ పెట్టుకొని అన్ని పరిశ్రమల హీరోలని తెచ్చి ఒక్క టాలీవుడ్ నే ఎందుకు వదిలేసాడో దర్శకుడికే తెలియాలి. పైగా టాలీవుడ్ లో ఒక్క ప్రమోషన్ కూడా లేకుండానే ఈ సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టారు. జైలర్ పార్ట్ 3 కూడా అనౌన్స్ చేసారు. కనీసం అందులో అయినా టాలీవుడ్ నుంచి ఎవరో ఒక హీరోని గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పిస్తారేమో చూడాలి.