సీఎం జగన్ తో భేటీ అయిన సినీ ప్రముఖులు

  • Publish Date - June 9, 2020 / 10:24 AM IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో  టాలీవుడ్ సినీ ప్రముఖులు  సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మెగాస్టార్  చిరంజీవి నేతృత్వంలోని  టాలీవుడ్ బృందం  ముఖ్యమంత్రిని కలిశారు. ఏపీలో షూటింగ్ లకు  సింగిల్ విండో అనుమతి ఇవ్వడంపై వారు  సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపనున్నారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున,దర్శకుడు రాజమౌళి, త్రివిక్రమ్, నిర్మాతలు సురేష్ బాబు, సి.కళ్యాణ్, దిల్ రాజు , దామోదర్ ప్రసాద్, విజయ్ చందర్ తదితరులు హాజరయ్యారు.

Read: ఇవాళే జగన్ దగ్గరకు టాలీవుడ్ ప్రముఖులు.. వెళ్లేది వీళ్లే!