×
Ad

Surya Kiran : టాలీవుడ్‌లో విషాదం.. బిగ్‌బాస్ ఫేమ్, ‘సత్యం’ దర్శకుడు సూర్యకిరణ్‌ మరణం..

'సత్యం' దర్శకుడు సూర్యకిరణ్‌ అనారోగ్యంతో మరణించారు.

  • Published On : March 11, 2024 / 02:53 PM IST

Tollywood Director Surya Kiran is passed away

Surya Kiran : టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శక నటుడు సూర్య కిరణ్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన.. నేడు (మార్చి 11) చెన్నైలో కన్నుమూశారు. మంగళవారం నాడు చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సూర్య కిరణ్ మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాప తెలియజేస్తున్నారు. కాగా సూర్య కిరణ్ ‘సత్యం’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ని స్టార్ట్ చేసారు. సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Also read : Kumari Aunty : సీరియల్స్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసిన కుమారి ఆంటీ.. ప్రోమో చూశారా..!

అంతేకాదు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా తరువాత ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్‌, చాప్టర్‌ 6 వంటి సినిమాలను కూడా తెరకెక్కించారు. అయితే సూర్య కిరణ్ దర్శకుడిగా అంటే నటుడిగా కెరీర్ ని ముందు స్టార్ట్ చేసారు. బాలనటుడిగా 200లకు పైగా సినిమాల్లో నటించిన సూర్య కిరణ్.. ఆ తరువాత కూడా పలు చిత్రాల్లో నటించారు. బాలనటుడిగా రెండు నేషనల్ అవార్డుల్ని, దర్శకుడిగా రెండు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు.

అలాగే తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తరువాత విడాకులతో ఇద్దరు విడిపోయారు.