Gama Awards : త్వరలో దుబాయిలో ‘గామా’ అవార్డ్స్ వేడుక.. SP బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా ‘గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు’..

దుబాయ్‌లో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ 'గామా' తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ గ్రాండ్ గా జరగనుంది.

Tollywood GAMA Awards Ceremony will Happening soon in Dubai

Gama Awards : దుబాయ్‌లో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ ‘గామా’ తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ గ్రాండ్ గా జరగనుంది. మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ఈ వార్డు వేడుకని గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు నిర్వహించబోతున్నారు. నేడు ఈ గామా వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి, విఎన్ ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత DVV దానయ్య, సాయి రాజేష్, ప్రసన్న, డింపుల్ హయతి, గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్.. పలువురు ప్రముఖులు హాజరయి ఈ అవార్డుకు సంబంధించిన ట్రోఫీని లాంచ్ చేశారు.

ఈ గామా అవార్డు వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ వేడుకలో సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. గతంలో గ్రాండ్ గా నిర్వహించిన గామా అవార్డ్స్ మధ్యలో మూడేళ్ల పాటు కోవిడ్ తో నిర్వహించలేకపోయారు. ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించబోతున్నారు. 2021, 2022, 2023లలో విడుదలైన సినిమాల నుంచి.. బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్.. వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ ఇవ్వబోతున్నాం అని తెలిపారు.

Also Read : Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్‌కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ఆ సినిమాకి సీక్వెల్..

దర్శకుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ఈ జ్యూరీలో సభ్యుడిగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి త్రిమూర్తులు గారు నిర్వహిస్తున్న ఈ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా మారుతుంది అని అన్నారు.

గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ.. తెలుగు, తమిళ, మళయాల సినీ పరిశ్రమల మధ్య దుబాయ్ గామా వేదిక‌పై ఈ వేడుక ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ ప్రముఖుల అందరిని ఈ వేడుకకు ఆహ్వానించాం అని తెలియచేశారు.

ఇక ఈ వేడుకల్లో.. ఆస్కార్ పురస్కారం అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌ల‌కు ప్రత్యేకంగా ‘గామా గౌరవ్ సత్కార్’తో పాటు, గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా ‘గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు’ను గాయకులు మనోకి అందిస్తున్నామని గామా అవార్డ్స్ దర్శకులు ప్రసన్న పాలంకి తెలిపారు. మార్చ్ 3 దుబాయ్ లో జరిగే ఈ అవార్డు వేడుకకు టాలీవుడ్ నుంచి అనేకమంది సెలబ్రిటీలు హాజరు కానున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు