Tollywood Hero : ఫ్లాప్స్‌లో ఉన్న హీరో.. మార్కెట్ లేని హీరో మీద వంద కోట్లు పెడుతున్నారా..?

ఓ హీరో తన మార్కెట్ ని మించి బడ్జెట్ పెడుతున్నాడు.(Tollywood Hero)

  • Published on- June 26, 2026 / 07:03 AM IST

Tollywood Hero

Tollywood Hero : ఇటీవల సినిమా బడ్జెట్స్ భారీగా పెరిగిపోయాయి. కనీస మార్కెట్ విలువలేని హీరోల మీద కూడా కోట్లు పెడుతున్నారు. ఏమన్నా అంటే కథ, విజువల్స్ మీద నమ్మకం అంటారు. తీరా సినిమా బయటకి వచ్చాక అది కూడా ఫ్లాప్ అయి చేతులు కాల్చుకుంటున్నారు నిర్మాతలు. ఎక్కడో అరా ఒకటి తప్ప కేవలం కథ నమ్ముకొని మంచి సినిమా తీస్తే అభినందనలు వస్తాయి కానీ కలెక్షన్స్ రావట్లేదు. స్టార్ హీరోలకే కలెక్షన్స్ గగనం అయ్యాయి ఈ రోజుల్లో.

అలాంటిది ఓ హీరో తన మార్కెట్ ని మించి బడ్జెట్ పెడుతున్నాడు. ఏకంగా తన కొత్త సినిమాకు వంద కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు సమాచారం. కెరీర్ ఆరంభంలో మంచి హిట్ సినిమాలు ఇచ్చిన ఈ హీరో గత అయిదేళ్లుగా ఫ్లాప్స్ లోనే ఉన్నాడు. మధ్యలో ఒకటి రెండు మంచి సినిమాలు చేసినా అవి కలెక్షన్స్ రాబట్టలేదు. ఈ హీరో కెరీర్ హైయెస్ట్ కలెక్షన్ అంటే ఓ అయిదేళ్ల క్రితం తన సినిమాకు 90 కోట్లు తెచ్చుకున్నాడు. అది కూడా దర్శకుడి ఫేమ్ తోడవడం వల్ల.

Also See : Munirathnam Jyothika : సీరియల్‌లో ట్రెడిషినల్ గా.. సోషల్ మీడియాలో మోడ్రన్ గా.. ‘గుండెనిండా గుడిగంటలు’ నటి ఫొటోలు..

ఇలాంటి సమయంలో ఆ హీరో వంద కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్నాడు. ఇంకా హైలెట్ ఏంటంటే ఆ సినిమాకు దర్శకుడు ఆ హీరోనే. నిర్మాతలు కూడా తన ఫ్యామిలీనే. పోనిలే ఇక్కడ అయినా బయటి నిర్మాతలను బలి చెయ్యట్లేదు అని సంతోషించాలి. అదృష్టం బాగుండి, కథ బాగుంటే, సినిమా హిట్ అయితే ఆ హీరోకి, సినిమాకు పనిచేసిన వాళ్లకు, నిర్మాతలకు మంచిదే. కొద్దిగా అటు ఇటు అయినా వంద కోట్లు రాబట్టడం కష్టమే.