Nikhil Siddhartha : ప్రజాస్వామ్యం బతికే ఉంది.. రేవంత్ రెడ్డి అన్న‌కు శుభాకాంక్ష‌లు : హీరో నిఖిల్‌

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తోంది.

Nikhil Siddhartha congratulations to Revanth Reddy

Nikhil Siddhartha-Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తోంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాదాపుగా చేరుకుంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ, నాయ‌కుల పై శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ఫ‌లితాల‌పై స్పందించారు.

RGV – KTR : కేటీఆర్ పై ఆర్జీవీ ప్రశంస.. నేనెప్పుడూ మీలాంటి లీడర్‌ని చూడలేదు..

రేవంత్‌రెడ్డికి ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మూడు రాష్ట్రాల్లో విజ‌యం దిశ‌గా దూసుకువెలుతున్న బీజీపీకి అభినంద‌లు తెలియ‌జేస్తూ రేవంత్ రెడ్డి, ప్ర‌ధాని మోదీ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రంలో అఖండ విజ‌యం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి అన్న‌కు కంగ్రాట్స్‌. అలాగే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల్లో విజ‌యం సాధించిన బీజేపీకి అభినంద‌న‌లు. ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది. జై హింద్.’ అంటూ నిఖిల్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ట్రెండింగ్ వార్తలు