×
Ad

Sree Vishnu : లీప్ ఇయర్ ఫిబ్రవరి 29 పుట్టిన ఏకైక హీరో.. వెరీ స్పెషల్ బర్త్ డే సెలెబ్రేషన్స్..

ఈ స్పెషల్ డేట్ ఫిబ్రవరి 29న మన టాలీవుడ్ లోనే ఓ హీరో పుట్టిన రోజు ఉంది.

  • Published On : February 29, 2024 / 01:06 PM IST

Tollywood Hero Sree Vishnu Birth Day on February 29 Leap Year Planning Special Celebrations

Sree Vishnu : మనం ఏ తేదీన పుట్టినా ప్రతి సంవత్సరం పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ లీప్ ఇయర్ లో ఫిబ్రవరి 29న పుడితే మాత్రం చాలా స్పెషల్. నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే లీప్ ఇయర్, ఫిబ్రవరి 29 డేట్ వస్తుంది. ఈ రోజు పుట్టిన వాళ్ళు నాలుగేళ్లకు ఒకసారి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఈ డేట్ లో పుట్టిన వాళ్ళ మీద సరదాగా సోషల్ మీడియాలో బోలెడు జోక్స్ కూడా ఉంటాయి.

అయితే ఈ స్పెషల్ డేట్ ఫిబ్రవరి 29న మన టాలీవుడ్ లోనే ఓ హీరో పుట్టిన రోజు ఉంది. ఆ హీరో ఎవరో కాదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో, అప్పుడప్పుడు ప్రయోగాత్మక సినిమాలతో మెప్పిస్తున్న హీరో శ్రీ విష్ణు. ఈ హీరో పుట్టిన రోజు నేడే. ఫిబ్రవరి 29న పుట్టిన శ్రీవిష్ణు నేటితో 40 ఇయర్స్ లోకి ఎంటర్ అయ్యాడు. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే బర్త్ డే కాబట్టి శ్రీ విష్ణు తన పుట్టిన రోజుని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే ఈ డేట్ లో పుట్టిన ఏకైక హీరో శ్రీ విష్ణు కావడం విశేషం.

Also Read : Naga Babu : నేను ఎవర్నీ అలా కావాలని అనలేదు.. క్షమాపణలు చెప్పిన నాగబాబు..

ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ఇప్పుడు మీడియం రేంజ్ హీరోగా మంచి మంచి సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే సామజవరగమన సినిమాతో ఫుల్ గా నవ్వించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి త్వరలో మార్చ్ 22న ఓం భీమ్ బుష్ అనే మరో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా నేడు శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా ‘స్వాగ్’ అనే మరో కొత్త సినిమా కూడా ప్రకటించారు. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో శ్రీ విష్ణుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.