Naga Babu : నేను ఎవర్నీ అలా కావాలని అనలేదు.. క్షమాపణలు చెప్పిన నాగబాబు..

నాగబాబు ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా దానిపై నేడు స్పందించారు.

Naga Babu : నేను ఎవర్నీ అలా కావాలని అనలేదు.. క్షమాపణలు చెప్పిన నాగబాబు..

Naga Babu Reacts on his Comments issue at Operation Valentine Movie Pre Release Event

Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. గతంలో టీవీ షోలలో కనిపించినా ఇప్పుడు అక్కడ కూడా కనపడట్లేదు. ప్రస్తుతం జనసేన పార్టీ తరపున రాజకీయాల్లో బిజీగా ఉన్నారు నాగబాబు. ఇటీవల వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగబాబు కూడా గెస్ట్ గా వచ్చారు.

నాగబాబు ఈ ఈవెంట్లో.. సినిమా గురించి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారుల గురించి, తమ ఫ్యామిలీకి ఆర్మీకి ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. అయితే ఇదే ఈవెంట్లో తన కొడుకు వరుణ్ ని ఉద్దేశించి.. పోలీసాఫీసర్, ఆర్మీ ఆఫీసర్ అంటే చూడటానికి హైట్, వెయిట్, మంచి ఫిజిక్ తో ఉండాలి. వరుణ్ దానికి బాగా సెట్ అయ్యాడు. తను 6 అడుగుల మూడు అంగుళాలు ఉన్నాడు కాబట్టి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇలాంటి పాత్రలు 5 అడుగుల మూడు అంగుళాల వ్యక్తులు చేస్తే సెట్ అవ్వదు అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సాధారణంగా కంపేర్ చేస్తూ మాట్లాడినవే అయిన ఓ హీరో ఫ్యాన్స్ తమ హీరోనే అన్నారని నాగబాబుపై విమర్శలు చేసారు. సోషల్ మీడియాలో నాగబాబు వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.

Also Read : Sree Vishnu : ‘స్వాగ్’ చూడు తమ్ముడు.. శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్.. చూస్తే పగలబడి నవ్వాల్సిందే..

దీంతో నేడు నాగబాబు తన సోషల్ మీడియాలో అధికారికంగా తన వ్యాఖ్యలపై స్పందించారు. తన పోస్ట్ లో.. ఇటీవల జరిగిన వరుణ్ బాబు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను, ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry, అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని కావాలని అన్న మాటలు కాదు. అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేసారు. దీంతో నాగబాబు పోస్ట్ మరోసారి వైరల్ గా మారింది. మరి దీనిపై ఆ హీరో ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.