Sree Vishnu : ‘స్వాగ్’ చూడు తమ్ముడు.. శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్.. చూస్తే పగలబడి నవ్వాల్సిందే..

తాజాగా నేడు శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త సినిమా ప్రకటించారు.

Sree Vishnu : ‘స్వాగ్’ చూడు తమ్ముడు.. శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్.. చూస్తే పగలబడి నవ్వాల్సిందే..

Sree Vishnu New Movie Comedy Entertainer Swag Title Glimpse Released

Updated On : February 29, 2024 / 1:07 PM IST

Sree Vishnu : హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలతో వస్తున్నాడు. ఇటీవల సామజవరగమన సినిమాతో ఫుల్ గా నవ్వించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. త్వరలో ఓం భీమ్ బుష్ అనే మరో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా నేడు శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త సినిమా ప్రకటించారు.

గతంలో శ్రీవిష్ణుతో రాజ రాజ చోర సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు హసిత్ గోలి ఇప్పుడు ‘స్వాగ్’ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. అడవిలో జంతువులు అన్ని మాట్లాడుకున్నట్టు, కథలు చెప్పినట్టు వాటికి సునీల్, గంగవ్వ.. వాయిస్ లు పెట్టి నవ్విస్తూ ‘స్వాగ్’ టైటిల్ ని ప్రకటించారు. చివర్లో ఈ కథ మగవాడిది, శ్వాగణిక వంశానిది అని శ్రీవిష్ణు వాయిస్ తో అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాని అచ్చ తెలుగు సినిమా అంటూ ప్రమోట్ చేస్తున్నారు. మరి సినిమాలో తెలుగు పదాలు, తెలుగుతనం ఎక్కువగా వాడతారేమో చూడాలి.

Also Read : Deepika Padukone – Ranveer Singh : పేరెంట్స్ కాబోతున్న దీపికా పదుకోన్ రణవీర్ సింగ్ దంపతులు.. అధికారికంగా ప్రకటన..

దీంతో ఈ సినిమా కూడా ఫుల్ కామెడీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. ఈ హీరో – డైరెక్టర్ కాంబో మరో హిట్ కొడతారని భావిస్తున్నారు. ఫుల్ గా నవ్విస్తున్న ఆ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి.