Anchor Suma : సుమ కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో చూశారా..? ఈ ఫ్రేమ్ కోసమే ఎదురు చూస్తున్నాం అక్కా..!
కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన యాంకర్ సుమ. ఈ ఫ్రేమ్ కోసమే ఎదురు చూస్తున్నాం అక్కా అంటూ..

Tollywood nchor Suma family photo gone viral
Anchor Suma : టాలీవుడ్ యాంకర్ సుమ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు తెలియజేస్తుంటారు. తాజాగా సుమ భర్త, టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల బర్త్ డే, దీపావళి పండుగ ఒకేసారి రావడంతో కుటుంబమంతా కలిసి గ్రాండ్ గా జరుపుకున్నారు. రాజీవ్ తో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకని ఫ్యామిలీ మెంబెర్స్ మధ్య సందడిగా జరిపించారు.
అందుకు సంబంధించిన వీడియోని సుమ ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోలో రాజీవ్ కి సుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొగిలించుకోగా.. ఆ సమయంలో రాజీవ్ వెనక్కి తిరిగి ఉన్నారు. దీంతో రాజీవ్, సుమతో.. నాకు మరో కౌగిలి కావాలి అని అడగడం అందర్నీ నవ్విస్తుంది. సుమ కూడా నవ్వుతూ రాజీవ్ కి మరో కౌగిలింత ఇచ్చారు. ఇక ఈ వీడియోతో పాటు కొన్ని ఫోటోలను కూడా సుమ షేర్ చేశారు.
Also read : BiggBoss Sivaji : మేము ఇలా ఉన్నామంటే నాగార్జున, చిరంజీవి కారణం.. శివాజీ భార్య కామెంట్స్ వైరల్..
View this post on Instagram
ఆ ఫొటోల్లో సుమ ఫ్యామిలీ అంతా కనిపిస్తుంది. సుమ తల్లి విమల, కొడుకు రోషన్, కూతురు మనస్విని, రాజీవ్ కనకాల ఇలా ఫ్యామిలీ మొత్తం కనిపిస్తున్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ తరువాత అందరూ కలిసి దీపావళి టపాసులు కలుస్తూ పండగని జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన నెటిజెన్స్.. ఈ ఫ్రేమ్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాము అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
కాగా సుమ కొడుకు రోషన్ ‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి సాంగ్ అండ్ టీజర్ ని ఇప్పటికే ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మొదటి సినిమాలోనే రోషన్ హీరోయిన్ కి ఘాటు లిప్‌లాక్ కి ఇచ్చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని డిసెంబర్ 29న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు.