Mohan Babu: మోహన్ బాబు మాస్ కంబ్యాక్.. ది ప్యారడైజ్ కోసం షాకింగ్ రెమ్యునరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
నాని ది ప్యారడైజ్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మోహన్ బాబు(Mohan Babu).
Mohan Babu receiving huge remuneration for the Paradise movie.
- నాని సినిమాలో విలన్ గా మోహన్ బాబు
- భారీ రెమ్యునరేషన్ ఇస్తున్న మేకర్స్
- ఇది మోహన్ బాబు మాస్ లెవెల్ అంటూ కామెంట్స్
Mohan Babu: నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.
ఇక నాని అవతారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు జాడలు వేసుకొని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు నాని. దీంతో, నాని కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మేకర్స్. కేవలం నాని విషయం లోనే కాదు, సినిమాలో మిగతా కాస్ట్ విషయంలో కూడా చాలా ప్రయోగాలు చేస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
Ramya Moksha: అబ్బబ్బా రమ్య మోక్ష.. బ్లాక్ డ్రెస్సులో గ్లామర్ కెవ్వు కేక.. ఫొటోలు
కలక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu), బాబు మోహన్, తనికెళ్ళ భరణి, సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళను ఈ సినిమా కోసం తీసుకొని ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఈ నేపధ్యంలోనే ఈ సినిమా కోసం మోహన్ బాబు తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అదేంటంటే, ది ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ పాత్ర కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట మోహన్ బాబు. మేకర్స్ ఈ సినిమా కోసం మోహన్ బాబుకి ఏకంగా రూ.5 కోట్ల నుంచి 8 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. గత కొన్నేళ్లుగా మోహన్ బాబు సినిమాల కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ తో పోల్చితే ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంలో మోహన్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీలవుతున్నారు. మోహన్ బాబు గత వైభవం ఈ సినిమా నుంచి మొదలవుతుందని. ఇక నుంచి వరుసగా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ ని మోహన్ బాబు అలరించాలని కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి, మరి మోహన్ బాబు విలన్ గా ఈ సినిమా ఏమేరకు హెల్ప్ అవుతుందా అని.
