Maa Oori Raja Reddy : ‘మా ఊరి రాజారెడ్డి’ రిలీజ్ ఈవెంట్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో RS మూవీ మేకర్స్ బ్యానర్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న సినిమా మా ఊరి రాజారెడ్డి.

Maa Oori Raja Reddy : ‘మా ఊరి రాజారెడ్డి’ రిలీజ్ ఈవెంట్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

Tollywood New Movie Maa Oori Raja Reddy release date update

Updated On : February 26, 2024 / 7:33 PM IST

Maa Oori Raja Reddy : నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో RS మూవీ మేకర్స్ బ్యానర్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న సినిమా మా ఊరి రాజారెడ్డి. తాజాగా ఈ సినిమా ప్రమోషనల్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాలచారి.. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. .

ఈ సినిమాని నిర్మల్ చుట్టుపక్కల రియల్ లొకేషన్స్ లో తెరకెక్కించారు. మా ఊరి రాజారెడ్డి సినిమా ఊళ్ళో పెద్దాయన చుట్టూ జరిగే కథలా ఉండబోతుంది. ఇక ఈ సినిమాని మార్చ్ 1న రిలీజ్ చేయనున్నారు.

Also read : Om Bheem Bush Teaser : సూపర్ హిట్ ట్రైయో ఈజ్ బ్యాక్.. ‘ఓం భీమ్ బుష్’ టీజర్ రిలీజ్..

Tollywood New Movie Maa Oori Raja Reddy release date update

ఈవెంట్లో ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాలచారి మాట్లాడుతూ.. మా ఊరి రాజారెడ్డి సినిమాలో నటించిన వాళ్లు, సాంకేతిక నిపుణులు అందరూ నిర్మల్ కి చెందిన వాళ్ళు కావడం ఆనందం. హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణాలో నిర్మల్, అదిలాబాద్, వరంగల్ లాంటి ప్రదేశాల్లో ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. వాటిని ఇందులో చూపిస్తున్నట్టు తెలుస్తుంది అంటూ మూవీ యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు.

హీరో నిహాన్, హీరోయిన్ వైష్ణవి.. మూవీ యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.