Vikramarkudu 2 : ‘విక్ర‌మార్కుడు 2’ గురించి నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

'విక్ర‌మార్కుడు 2' గురించి టాలీవుడ్ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఆల్రెడీ..

Tollywood Producer interesting comment about Ravi Teja Vikramarkudu 2

Vikramarkudu 2 : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మహారాజ్ ర‌వితేజ 2006లో చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ‘విక్ర‌మార్కుడు’. ర‌వితేజ మార్కెట్‌ను, రేంజ్‌ను పెంచిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ చిత్రంలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఒకటి దొంగ పాత్రలో అత్తిలిస‌త్తిబాబుగా కామెడీ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తే, మరొకటి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో విక్ర‌మ్ రాథోడ్ గా అదుర్స్ అనిపించారు.

ఈ సినిమాని తరువాత పలు భాషల్లో అక్కడి హీరోలు రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నప్పటికీ.. ఈ రెండు పాత్రలతో రవితేజ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోయారు. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు రావాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ సీక్వెల్‌కు కథ కూడా సిద్ధం చేసారు.

అయితే ఈ సీక్వెల్ ని తెరకెక్కించడానికి రాజమౌళి, రవితేజ ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ సీక్వెల్ గత మూడేళ్ళుగా చర్చల్లోనే నిలిచిపోయింది. తాజాగా ఈ సీక్వెల్‌పై భీమా ప్రొడ్యూస‌ర్ కేకే రాధామోహ‌న్ రియాక్ట్ అవుతూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు. విక్ర‌మార్కుడు 2 టైటిల్‌ను మూడేళ్ల క్రిత‌మే త‌మ బ్యాన‌ర్‌పై రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు రాధామోహ‌న్ చెప్పుకొచ్చారు.

Also read : Kalki 2898 AD : ఇటలీ షూటింగ్ సెట్స్ నుంచి.. ప్రభాస్, దిశా పటాని ఫొటో వచ్చేసింది..

ఇక ఈ మూవీని తెరకెక్కించడానికి దర్శకుడు సంపత్ నందిని కూడా ఫిక్స్ చేసి ఉంచారట. కానీ ఈ సీక్వెల్‌లో న‌టించ‌డానికి ర‌వితేజ పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆలస్యం అవుతూ వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రవితేజని ఒప్పించే ప్ర‌య‌త్నంలో ఉన్నట్లు, ఆయన ఒప్పుకుంటేనే సీక్వెల్ మొద‌లుపెడ‌తామంటూ చెప్పుకొచ్చారు. స‌రైన కాంబినేష‌న్ సెట్‌కాక‌పోతే మాత్రం ఈ సీక్వెల్ ని చేసేది లేదని వెల్లడించారు.

మరి ఈ సీక్వెల్ కి అంతా సెట్ అయ్యి ఆడియన్స్ ముందుకు వస్తుందా..? లేదా చర్చలోనే నిలిచిపోతుందా..? అనేది చూడాలి. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది బాలీవుడ్ మూవీ ‘రైడ్’కి రీమేక్ గా వస్తుంది.

ట్రెండింగ్ వార్తలు