Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు డిజిటల్ మార్కెట్ దెబ్బ.. అంచనాలు తలకిందులు.. ఆశలు ఆవిరి
సినిమాల ఆలస్య, డిజిటల్ మార్కెట్ నుంచి వస్తున్న ప్రెజర్ వల్ల టాలీవుడ్(Tollywood) నిర్మాతల ఇబ్బందులు.
- V Santhosh Kumar
- Published on- April 29, 2026 / 03:10 PM IST
Tollywood producers are facing difficulties due to delays in film production and a decline in the digital market.
- అంచనాలు తలకిందులు.. నిర్మాతల ఆవేదన.
- చేజారిన డీల్స్.. పెరుగుతున్న భారాలు.
- కుప్పకూలిన మార్కెట్.. విడుదల సవాల్.
Tollywood: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. త్వరలో రిలీజ్ కాబోతున్న ఒక భారీ సినిమాపై నిర్మాతలు పెట్టుకున్న అంచనాలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓటీటీ డీల్ కుదరడం లేదు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ సంస్థలు ఆఫర్ చేస్తున్న ధరలు నిర్మాతలకు ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో సదరు సినిమా ఓటీటీ డీల్ నిలిచిపోయింది. దీనివల్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలకు ఆశించిన స్థాయిలో ముందస్తు ఆదాయం రాక ఆర్థిక ఇబ్బందులు(Tollywood) మొదలవుతున్నాయి.
Sai Pallavi: ‘ఏక్ దిన్’ ప్రీమియర్స్ లో సాయి పల్లవి హవా.. క్యూట్ ఫొటోలు వైరల్
మరోవైపు, షూటింగ్ ఆలస్యం కావడం వల్ల మరో సినిమా తన చేతిలో ఉన్న అద్భుతమైన డీల్‌ను కోల్పోవాల్సి వచ్చింది. సరైన సమయానికి ప్రాజెక్ట్ పూర్తికాకపోవడం, ఒప్పంద నిబంధనల ప్రకారం గడువు ముగియడంతో ఓటీటీ సంస్థలు వెనక్కి తగ్గుతున్నాయి. డిజిటల్ మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి వల్ల కంపెనీలు తమ ధరలను తగ్గించేస్తున్నాయి. దీనివల్ల ఒకప్పుడు కోట్లలో పలికిన రేట్లు ఇప్పుడు గణనీయంగా పడిపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
నిర్మాతలు ఇప్పటికే మితిమీరిన బడ్జెట్, ప్రాజెక్ట్‌ల జాప్యం వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు ఓటీటీ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడం వారిని మరింత సంక్షోభంలోకి నెట్టేసింది. థియేటర్ల ఆదాయంపైనే పూర్తి భారం పడటం వల్ల సినిమా ఫలితం తేడా వస్తే కోలుకోవడం కష్టమని భావిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీలు, పడిపోతున్న మార్కెట్ విలువ మధ్య సినిమాలను విడుదల చేయడం ప్రస్తుతం పెద్ద సవాలుగా మారింది. మరి రానున్న ఈ సినిమాలకు ఇది పెద్ద సవాల్ గా మారె అవకాశం ఉంది.
