Dil Raju : ‘పెద్ది’ని టార్గెట్ చేశారా..? మీ సినిమాలైతే సమస్య గుర్తుకు రాదా? దిల్ రాజుపై నిర్మాతలు ఫైర్..

నేడు పర్సెంటేజ్ విధానాన్ని వ్యతిరేకించే నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి ఇండైరెక్ట్ గా శిరీష్, దిల్ రాజు పై ఫైర్ అయ్యారు. (Dil Raju)

  • Updated on- May 13, 2026 / 08:04 PM IST

Dil Raju

Dil Raju : తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రెంటల్ విధానం ఆపేసి పర్సెంటేజ్ విధానం తేవాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నా నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. దిల్ రాజుకి తెలంగాణలో థియేటర్స్ లో ఉండటంతో ఆయన సోదరుడు, నిర్మాత శిరీష్, మరికొంతమంది ఎగ్జిబిటర్స్, ఏషియన్ సినిమాస్ నిర్మాత సునీల్ నారంగ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టి పర్సెంటేజ్ ఇవ్వకపోతే సినిమాలు ఆపేస్తాం, థియేటర్స్ మూసేస్తాం అంటూ బెదిరించారు.

దీంతో నేడు పర్సెంటేజ్ విధానాన్ని వ్యతిరేకించే నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి ఇండైరెక్ట్ గా శిరీష్, దిల్ రాజు పై ఫైర్ అయ్యారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అప్పుడే ఈ పర్సెంటేజ్ సమస్యని లేవనెత్తారు. అప్పుడు కూడా దిల్ రాజు చేయిస్తున్నారని విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు డైరెక్ట్ గా పెద్ది సినిమా రిలీజ్ ముందు దిల్ రాజు సోదరుడే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టడంతో పెద్ది సినిమాను కావాలని టార్గెట్ చేసారని దిల్ రాజు పై ఆరోపణలు వస్తున్నాయి. అయితే నేడు ప్రెస్ మీట్ పెట్టిన నిర్మాతల్లో మైత్రి అధినేత రవి, సితార నాగవంశీ, సుధాకర్ చెరుకూరి డైరెక్ట్ గానే దిల్ రాజు పేరు చెప్పకుండా ఆయనపై ఆరోపణలు చేసారు.

Also Read : Tollywood Producers : ఏషియన్ సునీల్ నారంగ్ పై నిర్మాతల ఫైర్.. అసలు మీకేం తెలుసు.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..

టాలీవుడ్ నిర్మాతలు రవి, నాగవంశీ, సుధాకర్ మాట్లాడుతూ.. ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ సంతోషంగా లేరు. మేము ఒక్కరిమే మా ప్రయోజనం మేము చూసుకొని వెళ్ళిపోతాము అంటే కరెక్ట్ కాదు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకోవాలి. రాత్రికి రాత్రే జరిగిపోవాలంటే జరిగిపోయేవి కావు. ముగ్గురికీ సమస్యలు ఉన్నాయి. చర్చించుకొని పరిష్కరించుకుందాం. హరి హర వీరమల్లు విడుదల సమయంలో ఈ సమస్య తెరపైకి వచ్చింది. అప్పటినుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. మరి ఈ మధ్యలో వచ్చిన ఇన్ని సినిమాలకు లేని సమస్య మళ్ళీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఈ మధ్యలో మీరు చాలా సినిమాలు రిలీజ్ చేసారు. మీరు వార్2, కూలి, ఓజి, మన శంకర వరప్రసాద్ రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిబిటర్స్ కష్టాలు కనపడలేదా? ఇప్పుడు మీ చేతిలో పెద్ద సినిమా లేదని బ్లాక్ మెయిల్ చెయ్యడం కరెక్ట్ కాదు. సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు రిలీజ్ చేసారు కదా, అప్పుడు ఎందుకు ఈ సమస్యను తీసుకురాలేదు.

ఇప్పుడే జరిగిపోవాలని ఎందుకు పట్టుబడుతున్నారు? మీ సినిమా అయితే బాగుండాలి. మా సినిమా కాబట్టి ఇలా చేస్తారా? పక్క ఆఫీస్ లో సినిమా ఏమైపోయినా పర్లేదా. మా సినిమాల్లో కూడా మీకు డబ్బులు కావాలా? ఇలా చేయడం కరెక్ట్ కాదు. నాలుగైదు నెలల నుంచి సరైన సినిమా లేక అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. పెద్ది రూపంలో ఒక మంచి సినిమా వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు. 20 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అందరికీ తెలుసు. 20 సంవత్సరాల నుంచి ఎగ్జిబిటర్లకు న్యాయం చేయలేనిది ఈరోజు గుర్తుకొచ్చిందా? మొన్న సంక్రాంతి సినిమాలకు కూడా టికెట్ రేట్లు తెచ్చుకున్నారు కదా? మళ్ళీ ఇప్పుడు వాళ్ళే టికెట్ రేట్లు తెచ్చుకున్నా పెంచము అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్. మీరొక్కరే సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా? వేరేవాళ్లు ఎదగకూడదా? ఇవాళ మేము చేస్తున్నాము. రేపు ఇంకొకరు చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మరి దీనిపై దిల్ రాజు స్పందిస్తారా లేదా చూడాలి.

Also Read : Chiranjeevi: ముదురుతున్న ఎగ్జిబిటర్స్‌, ప్రొడ్యూసర్స్ వివాదం.. రంగంలోకి చిరంజీవి.. ‘పెద్ది’కి లైన్ క్లియర్ అయ్యేనా?