Actress Prabha : నటి ప్రభ కొడుకు పెళ్లిలో సందడి చేసిన టాలీవుడ్ స్టార్లు చిరంజీవి.. వెంకటేష్..

సీనియర్ నటి ప్రభ కొడుకు రాజా రమేష్‌ వివాహం విజయవాడకు చెందిన సాయి అపర్ణతో గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు.

Actress Prabha 2

Actress Prabha : సీనియర్ నటి ప్రభ కుమారుడి వివాహం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్లతో పాటు.. రాజకీయ నేతలు హాజరయ్యారు.

సీనియర్ నటి ప్రభ కుమారుడు రాజా రమేష్‌కి వైభవంగా పెళ్లి చేసారు. గండిపేట గోల్కోండ రిసార్ట్స్‌లో ఈ వేడుక జరిగింది. సినీ రంగ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రభ – రమేష్ (దివంగత) దంపతుల ఏకైక కుమారుడు రాజా రమేష్ అమెరికాలో స్థిరపడ్డారు. విజయవాడకు చెందిన సాయి అపర్ణతో రాజా రమేష్‌కి వివాహం జరిగింది. వీరి వివాహానికి చిరంజీవి, వెంకటేష్, మురళీ మోహన్, సుమన్, బోయపాటి శ్రీను, బెల్లంకొండ సురేష్ , ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ, రేలంగి నరసింహారావు, రోజా రమణి, అన్నపూర్ణమ్మ వంటి సినీ ప్రముఖులతో పాటు ఏపీ టీడీపీ నేత ఆలపాటి రాజా కూడా హాజరయ్యారు.

Actress Prabha 3

సీనియర్ నటి ప్రభ అసలు పేరు కోటి సూర్య ప్రభ. ‘నీడ లేని ఆడది’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగు భాషల్లో 100 కు పైనే సినిమాలలో నటించి అలరించారు. సంప్రదాయ నృత్య కళాకారిణి అయిన ప్రభ సినిమాలతో పాటు సీరియల్స్ తో కూడా సత్తా చాటుకున్నారు.