Tollywood starts : స్టార్స్ సపోర్ట్ ట్వీట్స్.. షాకింగ్ రివ్యూస్.

Tollywood starts : సినిమా రివ్యూలపై టాలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తోంది.

Tollywood starts tweet Movie Reviews Controversy

Tollywood starts : సినిమా రివ్యూలపై టాలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఒక్కొక్కరు ఒక్కోలా.. ఒక్కోసారి అందరూ ఒకేలా రివ్యూలు ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఇదే సమయంలో తమకు సన్నిహితంగా ఉన్న హీరోలు, దర్శకులు లేదా తమ బ్యానర్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలపై.. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు చేసే ట్వీట్లు ఆసక్తికరంగా మారుతున్నాయి.

మూవీ అద్భుతం, మైండ్ బ్లోయింగ్, మస్ట్ వాచ్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు పలువురు స్టార్స్‌. అయితే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ లేదా డిజాస్టర్ టాక్ వచ్చిన సందర్భాల్లో కూడా ఇలాంటి పోస్టులు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తోంది. రాజమౌళి, మహేష్ బాబు వంటి స్టార్ ఇమేజ్ ఉన్న ప్రముఖులు తమకు సంబంధించిన సినిమాలపై సోషల్ మీడియాలో స్పందించే తీరుపై ఆడియన్స్‌ చర్చించుకుంటున్నారట. అభిమానుల కోసం చేసే ప్రశంసలు ఒకవైపు ఉంటే..ఆడియన్స్ అభిప్రాయం మాత్రం మరోలా ఉండటంతో ఎక్కడో తేడా కొడుతోంది శీనా డైలాగ్ గుర్తు కొస్తుందట.

Sreemukhi : చీర‌క‌ట్టులో సాంప్ర‌దాయంగా.. యాంక‌ర్ శ్రీముఖి ఫోటోలు వైర‌ల్‌..

సినిమా సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా స్టార్స్ ఓ రేంజ్‌లో హైప్‌ ఇస్తూ ట్వీట్‌ చేయడం ఏంటన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. తమవాళ్ల సినిమా కాబట్టి తప్పనిసరిగా ప్రశంసించాల్సిందేనా.? లేక నిజాయితీగా సినిమా గురించి స్పందించాలా? అనే చర్చ జరుగుతోంది. ఒక సినిమాకు ముందుగా స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ నుంచి బ్లాక్‌బస్టర్ రేంజ్ ప్రశంసలు వస్తే.. అదే సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ వస్తే ఆ ట్వీట్ కూడా ట్రోలింగ్‌కు గురవుతోంది.

దీంతో తమ వాళ్లను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చేసిన ట్వీట్స్ చివరకు సదరు స్టార్స్ క్రెడిబిలిటీనే క్వశ్చన్ చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకపై స్టార్ హీరోలు, దర్శకులు సినిమా రివ్యూపై ఆచితూచి ట్వీట్స్‌ చేస్తారా? లేక సపోర్ట్ ట్వీట్ ట్రెండ్‌ను ఫాలో అవుతారా అనేది వేచి చూడాలి.