Tollywood Talk Chiranjeevi will remix super hit song ramma chilakamma from chudalani undi movie
Chiranjeevi : ఇంతవరకూ కొందరు మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేసుకొని ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశారు. అయితే ఇప్పుడా మ్యాజిక్ ను రీక్రియేట్ చేసే బాధ్యతను తనే తీసుకున్నారు చిరు. అంటే తన పాటను తనే రీమిక్స్ చేసు కుంటున్నారన్నమాట. పదేళ్ళ తర్వాత తిరిగి కమ్ బ్యాక్ ఇచ్చినా ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సుల్లో తనే కింగని నిరూపించుకుంటున్నారు. ఇదివరకటి లాగానే తన లేటెస్ట్ మూవీస్ లో కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తున్నారు. ‘భోళాశంకర్’ మూవీతో చిరు తిరిగి తన ఓల్డ్ స్కూల్ ఫార్ములాను అప్లై చేయబోతున్నారని టాక్.
ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన కోల్ కత్తా సెట్ లో ‘భోళాశంకర్’ సాంగ్ షూట్ జరుగుతోంది. అయితే ఈ పాట విషయంలోనే మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ ను ‘చూడాలనిఉంది’లోని తన సూపర్ హిట్ సాంగ్ ‘రామా చిలకమ్మా’ ను రీమిక్స్ చేయమన్నారని సమాచారం. తన తండ్రి మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సూపర్ హిట్ సాంగ్ కు మహతి ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగానే తిరిగి రీక్రియేట్ చేసి చిరంజీవిని ఇంప్రెస్ చేశాడని తెలుస్తోంది.
నిజానికి ఈ పాటను షూట్ చేసేటప్పుడు యూనిట్ మెంబర్స్ అంతా పాత పాటే అనుకున్నారట. దానికే చిరు కామెడీగా స్టెప్స్ వేస్తున్నారని భావించారట. అయితే కాదని తర్వాత తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలు చిరంజీవి పాటల్ని తమ సినిమాల్లో రీమిక్స్ చేసుకున్నారు. అయితే ఒక స్టార్ హీరో తన పాటను తనే తిరిగి రీమిక్స్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఈ న్యూస్ లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఒకవేళ నిజమే అయితే మరోసారి థియేటర్స్ లో ప్రేక్షకులతో రామ్మా చిలకమ్మా.. అంటూ కచ్చితంగా స్టెప్పులు వేయిస్తారు మెగాస్టార్.