Tom Cruise : 60 ఏళ్ళ ఏజ్ లో ఇన్ని స్టంట్స్.. మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా కోసం టామ్ క్రూజ్ విన్యాసాలు..
టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లోని ప్రతి సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సిరీస్ లో ఆరు సినిమాలు రాగా త్వరలో 7,8 సినిమాలు రాబోతున్నాయి. మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా షూట్.............
- Saketh U
- Published On : December 20, 2022 / 05:27 PM IST
Tom Cruise serious stunts for Mission Impossible Movie
Tom Cruise : హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ ఎన్నో యాక్షన్ సినిమాలతో ఇండియా ప్రేక్షకులకి కూడా చేరువయ్యాడు. ఇటీవలే టామ్ క్రూజ్ టాప్ గన్ మావెరిక్ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు. తన కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా టాప్ గన్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించి భారీగానే కలెక్షన్స్ ని సాధించింది.
టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లోని ప్రతి సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సిరీస్ లో ఆరు సినిమాలు రాగా త్వరలో 7,8 సినిమాలు రాబోతున్నాయి. మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా షూట్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాని 2023 జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
సాధారణంగానే టామ్ క్రూజ్ తన సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. చాలా వరకు డూప్ లేకుండానే టామ్ క్రూజ్ అన్ని యాక్షన్ సీన్స్ చేస్తాడు. తన అన్ని సినిమాల్లో, ముఖ్యంగా మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో యాక్షన్ సీన్స్ ఒళ్ళు గగుర్పుడిచేలా ఉంటాయి. అలాంటి సన్నివేశాలని కూడా ఎంతో ఈజీగా చేస్తాడు టామ్ క్రూజ్. ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా కోసం కూడా ఓ రేంజ్ లో యాక్షన్ సీన్స్ కోసం కష్టపడుతున్నాడు.
Varshini Sounderajan : గోవా బీచ్‌లో పట్టుచీరతో పెళ్లి మండపంలో యాంకర్ వర్షిణి స్పెషల్ ఫోజులు..
డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ దగ్గరుండి మరీ ఈ యాక్షన్ సీన్స్ ని పర్యవేక్షిస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా కోసం 500 స్కై డైవ్స్, 13 వేల బైక్ జంప్స్ చేశాడు. షూటింగ్ లోని కొన్ని క్లిప్స్ ని తాజాగా నిర్మాణ సంస్థ షేర్ చేసింది. ఇందులో టామ్ క్రూజ్ విన్యాసాలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. హెలికాఫ్టర్ నుంచి దూకడం, పై నుంచి బైక్ జంప్స్ చేయడం.. ఇలా చాలా విన్యాసాలు, యాక్షన్ సీన్స్ చేశాడు. దీంతో 60 ఏళ్ళ వయసులో ఈ రేంజ్ స్టంట్స్ ఏంట్రా బాబు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సీన్స్ థియేటర్లో చూడాలి అంటూ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
So excited to share what we’ve been working on. #MissionImpossible pic.twitter.com/rIyiLzQdMG
— Tom Cruise (@TomCruise) December 19, 2022
