2018 Movie : నిన్న ఇంటర్నేషనల్ అవార్డు.. నేడు ఆస్కార్‌కి ఎంపిక..
2018 మూవీ వరుసగా అరుదైన గౌరవాలు అందుకుంటూ వెళ్తుంది. నిన్న ఇంటర్నేషనల్ అవార్డు అందుకోగా నేడు ఆస్కార్‌కి..
- gum 95921
- Published on- September 27, 2023 / 03:12 PM IST
Tovino Thomas won Septimius Awards for 2018 Movie and now oscars entry
2018 Movie : టోవినో థామస్, తన్వి రామ్, అపర్ణ బాలమురళి, కుంచకో బోబన్, లాల్.. తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన మలయాళ సర్వైవల్ డ్రామా మూవీ ‘2018’. ఈ ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీ సక్సెస్ జర్నీ అక్కడితో ఆగిపోలేదు. పలు అవార్డులు అందుకుంటూ ముందుకు సాగుతూ వెళ్తుంది. ఈ అవార్డుల వేటని ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసింది.
Bigg Boss 7 Telugu : రైతు బిడ్డ తలకు గాయం.. కుప్పకూలిపోయిన పల్లవి ప్రశాంత్..!
నెదర్లాండ్స్ లో అందించే సెప్టిమిస్ అవార్డ్స్‌కి (Septimius Awards).. బెస్ట్ ఆసియన్ యాక్టర్ నామినేషన్స్ లో టోవినో థామస్ (Tovino Thomas), బెస్ట్ ఆసియన్ ఫిలిమ్ క్యాటగిరిలో 2018 సినిమా నామినేట్ అయ్యాయి. ఇక ఈ పురస్కారంలో టోవినో థామస్ బెస్ట్ యాక్టర్ గా ఈ ఇంటర్నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని టోవినో తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఈ ఇంటర్నేషనల్ గుర్తింపు తనకెంతో ప్రత్యేకమంటూ పేర్కొన్నాడు. ఇక ఈ అవార్డు సొంత చేసుకోవడంతో నెటిజెన్స్ ఈ హీరోకి విషెస్ తెలియజేస్తున్నారు.
Leo Audio Function Cancellled : ‘లియో’ ఆడియో లాంచ్ క్యాన్సిల్.. రాజకీయ ఒత్తిడే కారణమా?
తాజాగా నేడు ఈ మూవీ ఆస్కార్స్ కి అధికారంగా ఇండియా తరుపు నుంచి ఎంపిక అయ్యింది. భారత్ ప్రభుత్వం ఆస్కార్ నామినేషన్స్ కోసం 2018 మూవీని అధికారంగా పంపించారు. ఇక ఇలా వరుస గౌరవాలని దక్కించుకోవడంతో.. మూవీ టీం ప్రస్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నారు. గత ఏడాది RRR, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాలు ఇండియాకి ఆస్కార్ ని తెచ్చిపెట్టాయి. మరి 2018 సినిమా ఈ ఏడాది ఆస్కార్ సాధిస్తుందా..? లేదా..? చూడాలి.
కాగా ఈ మూవీ 2018 సంవత్సరంలో కేరళలో వచ్చిన భారీ వరదలు నేపథ్యంతో తెరకెక్కింది. కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇక రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
