Puri Jagannadh : దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం.. కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్..
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ (Puri Jagannadh) ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
- Thota Vamshi Kumar
- Updated on- July 26, 2026 / 07:25 PM IST
Tragedy in Puri Jagannadh house Pavitra shares emotional post
Puri Jagannadh : ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు పవిత్ర సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నానమ్మ చనిపోయిన విషయాన్ని తెలియజేసింది.
‘ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెట్టుకుంటారు? నీతో మరోరోజు గడిపే అవకాశమొస్తే బాగుండు. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ.’ అంటూ నానమ్మతో దిగిన ఫోటోను పవిత్ర ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
Anasuya Bharadwaj : కుటుంబంతో కలిసి కొండలు ఎక్కిన అనసూయ.. బాధపడటం లేదంటూ ఫోటోలు..
ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ సేతుపతి హీరోగా ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్. టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంస్థలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రొల్లా సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
