Trinatharao Nakkina : ‘ధమాకా’ పెద్ద హిట్.. సక్సెస్ ఈవెంట్లో డైరెక్టర్ కి అవమానం.. బాధ పడ్డాను అంటూ సంచలన కామెంట్స్..

తాజాగా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధమాకా సక్సెస్ తర్వాత తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చాడు.(Trinatharao Nakkina)

  • Published on- August 7, 2026 / 07:57 PM IST

Trinatharao Nakkina

Trinatharao Nakkina : రవితేజ కెరీర్ లో మొదటి వంద కోట్ల సినిమాగా ధమాకా నిలిచింది. రవితేజ, శ్రీలీల జంటగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా సినిమా 2022 లో రిలీజయి పెద్ద హిట్ అయింది. తాజాగా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధమాకా సక్సెస్ తర్వాత తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చాడు.

Also Read : Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో మళ్ళీ హిట్.. హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్న రితికా నాయక్..

త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ధమాకా పెద్ద సక్సెస్ అయింది. ఆ సక్సెస్ ఫంక్షన్ గ్రాండ్ గా చేసారు. ఆ రోజు కూడా స్టేజి మీద నేను బాగా మాట్లాడాను. స్పీచ్ అయ్యాక నేను కిందకు దిగిన తర్వాత నేను కూర్చోడానికి ఖాళీ లేదు. అంత పెద్ద హిట్ అయ్యాక కింద కూర్చోడానికి డైరెక్టర్ కి చైర్ లేదు. ఎక్కడైనా ఖాళీ ఉందేమో అని వెతుక్కొని వెనక్కు వెళ్లి రెండో లైన్ లో కూర్చున్నాను. అది ఎంత బాధగా ఉంటుంది. చాలా బాధ కలిగింది.

కానీ అది ఎవరూ గమనించలేదులే, పోనిలే అనుకున్నాను. కానీ ఇటీవల ఓ పెద్ద మనిషి ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసి ఎలా ఫేస్ చేసావు అని అడిగారు. దాంతో చాలా మంది గమనించే ఉంటారు అనుకున్నా. ఆ రోజు దానికి నేను ఫీల్ అయ్యాను. బాధ పడ్డాను. కానీ ఆ ఫంక్షన్ అయ్యాక దాన్ని వదిలేసాను అని తెలిపారు.