Tripuraneni Chitti Babu: ప్రముఖ నిర్మాత, దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

ప్రముఖ నిర్మాత, దర్శకుడు త్రిపురనేని చిట్టిబాబు(Tripuraneni Chitti Babu) గుండెపోటుతో కన్నుమూశారు.

Tripuraneni Chitti Babu has passes away.

Tripuraneni Chitti Babu: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Allu Arjun: ముంబై షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్.. అది నిజమే.. క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి వారసుడిగా చిట్టిబాబు(Tripuraneni Chitti Babu) చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 1955లో కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన, సినిమాపై మక్కువతో చెన్నైలో చదువు ముగించుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలత సహాయ దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, ‘సంతానం’ చిత్రంతో మెగాఫోన్ పట్టారు. తన కెరీర్‌లో 12 సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, సుమారు 30 చిత్రాల్లో నటుడిగా వెండితెరపై మెరిశారు. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.