Trisha Krishnan: సౌత్ లో త్రిష సెంటిమెంట్.. ‘విశ్వంభర’ బ్లాక్ బస్టర్ గ్యారంటీ… ప్రూఫ్స్ ఇవిగో!
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాకు త్రిష (Trisha Krishnan)సెంటిమెంట్.
- V Santhosh Kumar
- Published on- May 25, 2026 / 04:07 PM IST
Trisha Sentiment for Chiranjeevi Vishwambhara movie
- త్రిష సెంటిమెంట్‌తో ఇండస్ట్రీ షేక్
- వరుస హిట్లతో లక్కీ చార్మ్
- మెగాస్టార్ విశ్వంభర నెక్స్ట్ లెవెల్
Trisha Krishnan: సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘చెన్నై చిన్నది’ త్రిష క్రేజ్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సీనియర్ స్టార్ హీరోల పక్కన నటిస్తూ, వారందరికీ బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందిస్తూ ఇండస్ట్రీలో మోస్ట్ లక్కీ చార్మ్‌గా మారిపోయింది. దళపతి విజయ్‌తో ఆమె నటించిన ‘లియో’ సంచలన విజయం సాధించగా, అజిత్ సరసన చేసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, రీసెంట్‌గా సూర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘కరుప్పు’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో ‘త్రిష సెంటిమెంట్’ గట్టిగా నడుస్తోంది.
Allu Arjun: అల్లు అర్జున్ ‘లగ్జరీ పాటెక్ వాచ్’.. ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం.
ఇదే సెంటిమెంట్‌తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో త్రిష(Trisha Krishnan)నే హీరోయిన్ కావడం విశేషం. అయితే, అత్యున్నత ప్రమాణాలతో కూడిన భారీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ కారణంగా ఈ సినిమా దాదాపు ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకోవడంతో, త్వరలోనే సరికొత్త విడుదల తేదీపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు.
నిరంతర ఆలస్యం కారణంగా సాధారణంగా ఏ సినిమాకైనా అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది, కానీ ‘విశ్వంభర’ విషయంలో ట్రేడ్ వర్గాలు పూర్తి భిన్నంగా విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా త్రిష సెంటిమెంట్ వల్ల మెగాస్టార్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పడటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, చిరంజీవి మార్క్ గ్రేస్, త్రిష లక్కీ ఫ్యాక్టర్ అన్నీ కలిసి ఈ సోషియో ఫాంటసీ వండర్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి త్రిష సెంటిమెంట్ వల్ల విశ్వంభర సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తుంది అని.
