Trisha-Vijay : విజయ్‌కు త్రిష షాక్.. అన్‌ఫాలోతో మొదలైన కొత్త చర్చ!

విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా త్రిష (Trisha-Vijay ) శుభాకాంక్ష‌లు చెప్ప‌క‌పోవ‌డం ఫ్యాన్స్‌ను ఎంతో ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

Trisha unfollowed vijay skips birthday wishes rumors

Trisha-Vijay : స్టార్ హీరోయిన్ త్రిష‌, తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజ‌య్‌లు రిలేష‌న్‌లో ఉన్నార‌ని గ‌త‌కొన్నాళ్లుగా వార్త‌లు వ‌చ్చాయి. వీటిపై అటు విజ‌య్ గానీ, ఇటు త్రిష గానీ స్పందించ‌లేదు. అయితే.. లేటెస్టుగా వీరిద్ద‌రు విడిపోయార‌నే వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా త్రిష శుభాకాంక్ష‌లు చెప్ప‌క‌పోవ‌డం ఫ్యాన్స్‌ను ఎంతో ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అంతేకాదండోయ్‌ విజ‌య్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆమె అన్‌ఫాలో చేయ‌డంతో విడిపోయార‌నే వార్త‌లు మొద‌లు అయ్యాయి.

జూన్ 22న విజ‌య్ పుట్టిన రోజు. 52వ ప‌డిలో అడుగుపెట్టిన సంద‌ర్భంగా అభిమానులు, సినీ రాజ‌కీయ నాయ‌కులు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక విజ‌య్ సీఎం అయిన త‌రువాత తొలి పుట్టిన రోజు కావ‌డంతో త్రిష ఎలా విషెస్ చెబుతుంద‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూశారు.

Anchor Manjusha : రెట్రో లుక్‌లో యాంక‌ర్ మంజూష‌.. ఫోటోలు..

కాగా.. గత కొన్ని సంవత్సరాలుగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష ప్రత్యేక ఫొటోలు, భావోద్వేగ సందేశాలను సోషల్ మీడియాలో పంచుకునేది. అయితే ఈసారి ఆమె నుంచి అలాంటి పోస్టు రాకపోవడంతో అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో విజ‌య్‌ను అన్‌ఫాలో చేయ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదైనా విభేదాలు వ‌చ్చాయా అనే ఉహాగానాలు మొద‌లు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Chiranjeevi : స‌మంత ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి!