Chiranjeevi : సమంత ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి!
సమంత తల్లికాబోతుందనే విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా కన్ఫర్మ్ చేసేశారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).
Mega Star Chiranjeevi comfirm Samantha pregnancy
Chiranjeevi : నటి సమంత ప్రెగ్నెన్సీతో ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. మా ఇంటి బంగారం ప్రమోషన్స్ సమయంలో సమంత బేబీ బంప్‌తో కనిపించడమే ఇందుకు కారణం. కాగా.. దీనిపై ఇప్పటి వరకు అటు సమంత గానీ, ఇటు ఆమె భర్త రాజ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం సమంత తల్లికాబోతుందనే విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా కన్ఫర్మ్ చేసేశారు.
సమంత నటించిన మా ఇంటి బంగారం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి అభినందించారు.
*Keerthi Suresh : భర్తతో కలిసి సీఎం విజయ్ను కలిసిన కీర్తి సురేష్.. ఫోటోలు వైరల్
సమంత దంపతులకు నూతన వస్త్రాలతో పాటు బహుమతలు అందించారు. కాసేపు సామ్ దంపతులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిరంజీవి.. సమంత తల్లికాబోతున్న విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా చెప్పేశారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత అండ్ రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు అని అన్నారు.
మా ఇంటి బంగారం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. సమంత నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం. ఈ విజయానికి సమంత, నందిని రెడ్డి, రాజ్, మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత అండ్ రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు అని చిరంజీవి తెలిపారు.
*Anchor Sravanthi : భారీ హారంతో మిలమిలా మెరిసిపోతున్న యాంకర్ స్రవంతి..
“మా ఇంటి బంగారం“ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. @Samanthaprabhu2 నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.… pic.twitter.com/eE5xemjh3c
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 23, 2026
