Aadarsha Kutumbam : వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?
మొదటిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. (Aadarsha Kutumbam)
- Saketh U
- Published on- June 27, 2026 / 04:20 PM IST
Aadarsha Kutumbam
Aadarsha Kutumbam : త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆదర్శ కుటుంబం. హౌస్ నెంబర్ 47 అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఇందులో శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. వెంకటేష్ ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఓ ఫ్యామిలీ మ్యాన్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. త్రివిక్రమ్ రచయితగా వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు పనిచేసారు.
Also Read : Allu Sneha Reddy : సినిమా ఓపెనింగ్‌లో మామకోడలు సందడి.. అల్లు అరవింద్, స్నేహారెడ్డి ఫొటోలు వైరల్..
మొదటిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఆదర్శకుటుంబం సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వెంకీమామ, తన ఫ్యామిలీ ఉన్న స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. దీంతో వెంకీమామ, త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
