Trivikram Srinivas : త్రివిక్రమ్ భార్య నృత్య ప్రదర్శన.. స్పెషల్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్
త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ తాజాగా ‘మీనాక్షి కళ్యాణం’ అనే శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా.....
- Saketh U
- Published On : December 17, 2021 / 11:46 AM IST
Trivikram
Trivikram Srinivas : ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. అయన ఫ్యామిలీ గురించి బయట అందరికి ఎక్కువగా తెలియదు. ఆయన భార్య సౌజన్య బయటకి, మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అయితే త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ మంచి క్లాసికల్ డ్యాన్సర్. గతంలో పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. తాజాగా మరోసారి ఆవిడ కాలికి గజ్జె కట్టబోతున్నారు.
త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ తాజాగా ‘మీనాక్షి కళ్యాణం’ అనే శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఈ నృత్య ప్రదర్శన డిసెంబర్ 2వ తేదీనే జరగాల్సి ఉంది. అయితే సౌజన్య బాబాయ్, ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకస్మాత్తుగా మరణించడంతో ఈ నాట్య ప్రదర్శన వాయిదా పడింది. ఇప్పుడు ఈ నాట్య ప్రదర్శన ఇవాళ సాయత్రం 6 గంటల నుంచి శిల్పకళా వేదికలో జరగనుంది. దీనికి పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వం వహించనున్నారు.
Anasuya : మీరు ఎప్పటికీ టైగర్ దర్శన్ పెహెల్వానే.. తండ్రిపై ఎమోషనల్ పోస్ట్ చేసిన అనసూయ
హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలసి ఈ ఈవెంట్‌ను అందిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. త్రివిక్రమ్ తో ఉన్న స్నేహ బంధంతోనే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. దీంతో ఒక్కసారిగా త్రివిక్రమ్ భార్య సౌజన్య వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ వస్తుండటంతో ఈ కార్యక్రమానికి మరింత హైప్ వచ్చింది. ఈ నృత్య ప్రదర్శనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తనికెళ్ల భరణి, వసంత లక్ష్మీ నరసింహాచారి, చుక్కపల్లి సురేష్, సతీష్ చంద్ర గుప్తా లాంటి మరికొంత మంది ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.
