×
Ad

Censor Board : చివరి నిమిషంలో సినిమాలని ఇబ్బంది పెడుతున్న సెన్సార్ బోర్డు.. అసలు వదిలేసి కొసరు పట్టుకొని..

తాజాగా మరోసారి సెన్సార్ బోర్డు పై విమర్శలు వస్తున్నాయి. (Censor Board)

  • Published On : February 16, 2026 / 03:47 PM IST

Censor Board

Censor Board : సెన్సార్ బోర్డు కి ఒకప్పుడు సినిమా వాళ్ళు భయపడేవాళ్లు. సినిమాలో ఏది తీసేయమంటారో అని జాగ్రత్తగా సినిమాలు తీసేవాళ్ళు. కానీ గత కొన్నాళ్లుగా రక్తపాతం, హింస, రొమాన్స్, అడల్ట్ కంటెంట్, బూతులు పెరుగుతున్నా వాటికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చేయడంతో అవి రిలీజ్ అవుతున్నాయి. రిలీజయ్యాక అసలు ఇలాంటివి సెన్సార్ బోర్డు ఎలా ఓకే చేసిందని విమర్శలు కూడా వస్తున్నాయి పలు సినిమాలపై.(Censor Board)

తాజాగా మరోసారి సెన్సార్ బోర్డు పై విమర్శలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డు ఇప్పుడు సినిమా టైటిల్స్ మీద పడింది. సినిమా మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఓ టైటిల్ తో ప్రమోషన్ చేసుకుంటూ వస్తే చివరి నిమిషంలో సెన్సార్ కి రాగానే ఆ టైటిల్ మార్చమని ఇబ్బంది పెడుతున్నారు. అసలు వాటితో ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోయినా సెన్సార్ బోర్డు టైటిల్స్ మార్పిస్తుంది.

Also Read : Dushyanth : ఎంపీ కూతుర్ని నిశ్చితార్థం చేసుకున్న హీరో.. ఫోటోలు వైరల్.. విజయ్ రష్మిక పెళ్లి రోజే..

ఇటీవల వానర అనే సినిమా టైటిల్ ని వనవీర గా మార్పించింది. పాపం చిన్న సినిమా కావడంతో మూవీ టీమ్ వానర అని బాగా ప్రమోట్ చేసాము కానీ సెన్సార్ బోర్డు ఆ టైటిల్ తీసేయమంది అని ఎమోషనల్ అయ్యారు. మళ్ళీ వనవీర అనే టైటిల్ ని ప్రమోట్ చేయడానికి కష్టపడ్డారు.

రీసెంట్ గా ఈ వారం విడుదలయిన సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ ని కూడా మార్చమంది సెన్సార్ బోర్డు. అందుకు నిర్మాతలు ఒప్పుకోకవపోవడంతో అందులో ఏమి లేకపోయినా A సర్టిఫికెట్ ఇచ్చారు. దీనిపై సినీ పరిశ్రమ నుంచి, ప్రేక్షకులు, జర్నలిస్టులు, సినిమా లవర్స్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఒక మంచి ఎమోషనల్ ప్రేమకథ. ఈ సినిమాకు అసలు A ఎలా ఇచ్చారు, ఆ టైటిల్ లో తప్పేముంది అంటూ సోషల్ మీడియాలో చాలా మంది సెన్సార్ బోర్డు పై ఫైర్ అయ్యారు.

Also Read : Vijay Rashmika : విజయ్ – రష్మిక పెళ్లి ఇన్విటేషన్ వైరల్.. పెళ్లి, రిసెప్షన్ ఎప్పుడు, ఎక్కడ..?

తాజాగా రాబోయే మరో రెండు సినిమాల టైటిల్స్ ని మార్పించింది సెన్సార్ బోర్డు. రాజీవ్ కనకాల చేస్తున్న చాయ్ వాలా సినిమాకు సెన్సార్ బోర్డు టైటిల్ అభ్యంతరం చెప్పడంతో నవాబ్ కేఫ్ అని మార్చక తప్పలేదు. ఇక సుహాస్ హీరోగా రాబోతున్న హే భగవాన్ సినిమా టైటిల్ కి కూడా అభ్యంతరం చెప్పడంతో నేడు ఆ సినిమా టైటిల్ ని హే బలవంత్ అని మార్చినట్టు ప్రకటించారు. సినిమాలో ఉన్న పేర్లకు, కంటెంట్ కి హే భగవాన్ అనేది కరెక్ట్ గా సరిపోతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అలాంటిది ఎందుకు మార్పించిందో సెన్సార్ బోర్డు అని ప్రశ్నిస్తున్నారు.

Censor Board

అసలు అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను కూడా A సర్టిఫికెట్ ఇచ్చి రిలీజ్ చేయిస్తుంటే ఏమి లేని మంచి సినిమాలకు ఎలాంటి సమస్య లేని టైటిల్స్ ని మార్చమంటూ సెన్సార్ బోర్డు ఎందుకు చివరి నిమిషంలో ఇబ్బంది పెడుతుంది అని ఇటు సినీ ప్రముఖులు, అటు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఇక నుంచి టైటిల్ రిజిస్ట్రేషన్ సమయంలోనే సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకునేలా ఏదైనా ప్రాసెస్ ఉంటే బెటర్ అని నిర్మాతలు కామెంట్స్ చేస్తున్నారు.