Vijay- Chiranjeevi: విజయ్ తండ్రితో చిరంజీవి అనుబంధం.. ఆ అవకాశం ఇచ్చింది చిరునే.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే?

తమిళనాడులో విజయ్ విజయ్(Vijay- Chiranjeevi) విజయం సాధించిన వేళ ఆయన తండ్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

tvk party vijay thalapathy father chandrasekhar relationship with chiranjeevi

  • విజయ్ తండ్రికి చిరంజీవితో అనుబంధం.
  • మెగాస్టార్‌తో మూడు సూపర్ హిట్లు.
  • తెలుగు ఎంట్రీ చిరంజీవి సినిమాతోనే.

Vijay- Chiranjeevi: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని ‘TVK’ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుండటంతో, ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌కు మెగాస్టార్ చిరంజీవితో ఉన్న పాత అనుబంధం ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్ కేవలం తమిళ దర్శకుడే కాకుండా, తెలుగులోనూ తన ముద్ర వేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన తెలుగు సినీ రంగ ప్రవేశం మెగాస్టార్ చిరంజీవి సినిమాతోనే జరిగింది. అప్పట్లో కేవలం మూడు తమిళ చిత్రాల అనుభవం ఉన్న చంద్రశేఖర్‌ను నమ్మి చిరంజీవి తనకు అవకాశం ఇవ్వడం విశేషం.

Vijay Thalapathy: తమిళనాట టీవీకే పార్టీ ఘనవిజయం.. విజయ్‌కు సెలబ్రిటీల శుభాకాంక్షలు

చిరంజీవి, చంద్రశేఖర్ (Vijay- Chiranjeevi)కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘చట్టానికి కళ్లు లేవు’ (1981) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి, వీరిద్దరి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ‘పల్లెటూరి మొనగాడు’, ‘దేవాంతకుడు’ చిత్రాలు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇలా వీరిద్దరి మధ్య బంధుత్వం లేకపోయినా, అద్భుతమైన ‘సినిమా బంధం’ ఏర్పడింది.

చంద్రశేఖర్ తెలుగులో మొత్తం ఆరు సినిమాలు తెరకెక్కించగా, అందులో విజయం సాధించిన మూడు చిత్రాలు చిరంజీవి నటించినవే కావడం గమనార్హం. మెగాస్టార్‌తో ఆయనకు ఉన్న ఈ విడదీయలేని అనుబంధం వల్లే తెలుగు ప్రేక్షకులకు కూడా చంద్రశేఖర్ సుపరిచితులయ్యారు. ఇప్పుడు తన కుమారుడు విజయ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం దిశగా దూసుకుపోతుండటంతో, తండ్రిగా చంద్రశేఖర్ పాత విజయాలు, చిరంజీవితో ఆయనకున్న స్నేహం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.