Unlock 4: వచ్చే నెల నుంచి సినిమా హాల్స్ ఓపెన్.. కండిషన్స్ అప్లై

ప్రభుత్వం తర్వాతి అన్‌లాక్ అజెండాలో భాగంగా సినిమా థియేటర్లు రీ ఓపెన్ కావొచ్చంటున్నారు. మహమ్మారి వ్యాప్తి అనేది హెచ్చుతగ్గులు లేకుండా కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెస్టారెంట్లు, జిమ్స్, మాల్స్ రీ ఓపెన్ చేశాక సినిమా హాళ్లు కూడా తర్వాతి ఫేజ్ లో భాగంగా ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు నెలాఖరుకు అధికారిక ప్రకటనలో ఈ విషయం తేలిపోనుంది.



బిజినెస్ డైలీ ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు ఆధారంగా స్టాండలోన్ సినిమా హళ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అది కూడా సామాజిక దూరం, శానిటైజేషన్ నియమాలు అనుసరిస్తేనే. వరుసల మధ్య ఖాళీలు ఇస్తూ.. కూర్చోవాలని పొందుపరచనున్నారు. గరిష్ఠ సీటింగ్ ను ముందుగానే సినిమా హాల్స్ మేనేజ్ మెంట్ నిర్ణయాలని ఐదు వరుసలు ఉంటే అందులో మూడు వరుసల్లోనే కూర్చోవడానికి అనుమతి ఇవ్వాలని తెలిపింది.

ఇంకా ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని 24 డిగ్రీలు మెయింటైన్ చేసే హాస్పిటల్స్ మాత్రమే ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్పెషల్ ఎఫెక్ట్స్ కావాల్సిన సినిమాలకు 3డీ అద్దాలు వాడాల్సి వస్తే.. వాటికి శానిటైజ్ తప్పనిసరి. హ్యాండ్ శానిటైజేషన్ ప్రాముఖ్యత తెలియజేస్తూ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం పోస్టర్లు ఉంచాలి. ఇంటర్వెల్ సమయాల్లో కూడా వీటిని గుర్తు చేయాలి.



స్టాండలోన్ సినిమా హాల్స్ ఓపెన్ చేయొచ్చు కానీ, మల్టీప్లెక్స్ సినిమా హాల్స్, మాల్స్ గురించి ఎటువంటి నిర్థారణకు రాలేదు. జిమ్స్, యోగా సెంటర్లకు అనుమతులిచ్చాక తమను కూడా పట్టించుకోవాలంటూ హాల్ ఓనర్స్ రిక్వెస్ట్ చేయడంతో ఈ అంశం తెరమీదకు వచ్చింది.