Unstoppable 2 : నారి నారి నడుమ నందమూరి.. అన్‌స్టాపబుల్ కొత్త గెస్ట్‌లు వేరే..

నందమూరి నటసింహం వ్యాఖ్యాతగా మారి టాక్ షోతో కూడా రికార్డులు నెలకొలుపుతూ.. రికార్డులు సృష్టించాలన్నా మేమే, వాటిని తిరిగి రాయాలన్నా మేమే అన్నట్లుగా దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోకి అదిరిపోయే గెస్ట్‌లని తీసుకు వచ్చిన బాలయ్య, ఈసారి అందాల భామలతో నారి నారి నడుమ మురారి అని సందడి చేయడానికి సిద్దమవుతున్నాడు.

Unstoppable 2 : నారి నారి నడుమ నందమూరి.. అన్‌స్టాపబుల్ కొత్త గెస్ట్‌లు వేరే..

Unstoppable 2 new episode guests

Updated On : December 19, 2022 / 4:26 PM IST

Unstoppable 2 : నందమూరి నటసింహం వ్యాఖ్యాతగా మారి టాక్ షోతో కూడా రికార్డులు నెలకొలుపుతూ.. రికార్డులు సృష్టించాలన్నా మేమే, వాటిని తిరిగి రాయాలన్నా మేమే అన్నట్లుగా దూసుకుపోతున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోకి అదిరిపోయే గెస్ట్‌లని తీసుకు వచ్చిన బాలయ్య, ఈసారి అందాల భామలతో నారి నారి నడుమ మురారి అని సందడి చేయడానికి సిద్దమవుతున్నాడు.

Unstoppable 2: పవన్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ ముచ్చట.. ఆ రోజేనా?

అందం అభినయం కలగలిపిన సహజనటి జయసుధ, ముల్టీటాలెంటెడ్ జయప్రద మరియు రావిషింగ్ రాశి ఖన్నా.. నెక్స్ట్ ఎపిసోడ్ గెస్ట్ లుగా రాబోతున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు. ఆ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తీ చేసుకోవడంతో, అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది ఆహా టీమ్. ఈసారి ఎపిసోడ్ లో ముగ్గురు భామలతో అందంగా మారనుంది అన్‌స్టాపబుల్.

అయితే ప్రేక్షకుల అంతా ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. విడుదలైన ప్రోమోలు, ఫోటోలు ఆ ఎపిసోడ్ అంచనాలు మరెంత పెంచేసిని. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో ఒక కోటి వ్యూస్ తో, తొమ్మిది లక్షల లైక్స్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న ప్రసారం చేయనున్నారు. మరి ప్రోమోలతోనే రికార్డులు సృష్టించిన ఈ ఎపిసోడ్.. రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు నెలకొలుపుతుందో చూడాలి.