Ola Uber Rapido Drivers strike : ఉబర్, ర్యాపిడో, ఓలా డ్రైవర్ల సమ్మె.. ఎప్పుడు..? కారణం ఏమిటంటే..
Ola Uber Rapido Drivers strike : ఓలా, ఉబర్, ర్యాపిడో, పోర్టర్, అంకుల్ మూవర్ లాంటి ఆన్లైన్ యాప్ ఆధారిత రవాణా కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Ola Uber Rapido Drivers strike
Ola Uber Rapido Drivers strike : ఉబర్, ఓలా, ర్యాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఓలా, ఉబర్, ర్యాపిడో, పోర్టర్, అంకుల్ మూవర్ లాంటి ఆన్లైన్ యాప్ ఆధారిత రవాణా కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెకు దిగేందుకు నిర్ణయించారు.
Also Read : Gold Price : బంగారం, వెండి ధరల్లో గణనీయ మార్పు.. 2008 తరువాత ఇదే తొలిసారి.. ప్రధాన కారణాలివే.
తెలంగాణ యాప్ బెస్ట్ డ్రైవర్ల ఫోరం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం సమావేశం జరిగింది. ఆన్లైన్ యాప్ ఆధారిత రవాణా కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలంగాణ గిగ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, ఏఐటీయూసీ వెంకటేశం, బీఆర్టీయూ నగేశ్ కుమార్ తదితరులు పేర్కొన్నారు.
ఓలా, ఉబర్, ర్యాపిడో, పోర్టర్, అంకుల్ మూవర్ లాంటి ఆన్లైన్ యాప్ ఆధారిత రవాణా కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటి వరకు కనీస ప్రాథమిక చార్జీలను నోటిపై చేయలేదని అన్నారు. దీంతో ఆయా కంపెనీలు డ్రైవర్ల ఆదాయాన్ని ఏకపక్షంగా తగ్గిస్తూ కమిషన్లను పెంచుకుంటున్నాయని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, వాహన నిర్వహణ ఖర్చులు, బీమా, ఇతర ఖర్చులు పూర్తిగా డ్రైవర్ మీదనే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి గుర్తింపు పొందిన డ్రైవర్ యూనియన్ లతో సంప్రదించి రవాణా సేవలకు కనీస ప్రాథమిక చార్జీలను నోటిఫై చేయాలని డిమాండ్ చేశారు.
క్యాబ్ కిలోమీటర్‌కు రూ.25తగ్గకుండా ఫిక్స్ చేయాలని, రాష్ట్రంలోకి రాకుండా ఇతర రాష్ట్ర క్యాబ్ , ఆటో, వాహనాలను తక్షణమే నిషేదించాలని కోరారు. ఫిబ్రవరి 7న దేశవ్యాప్తంగా నిర్వహించే బంద్ కు యాప్ ఆధారిత రవాణా కార్మికుల యూనియన్లు మద్దతు తెలిపి పాల్గొనాలని పిలుపునిచ్చారు.
