Unstoppable : 24 గంటల్లో అదిరిపోయే వ్యూస్ సాధించిన అన్స్టాపబుల్.. బావతో కలిసి బాలయ్య సరికొత్త రికార్డు
ఇటీవలే అన్స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ రిలీజ్ అయింది. అన్స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు, లోకేష్ వస్తున్నారు అని తెలియడంతో ముందు నుంచి ఈ ఎపిసోడ్ మీద విపరీతమైన హైప్...................
- Saketh U
- Published on- October 16, 2022 / 08:49 AM IST
Unstoppable season 2 first episode creates a new record in ott
Unstoppable : బాలయ్య బాబు ఆహాలో మొదలుపెట్టిన అన్స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అదే ఊపులో సీజన్ 2ని కూడా గ్రాండ్ గా లాంచ్ చేశారు. గతంలో కంటే మరిన్ని అంచనాలు ఈ సీజన్ పై ఉండటంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ సీజన్ కోసం ఆతృతగా ఎదురు చూశారు. అన్స్టాపబుల్ సీజన్ 2ని అభిమానుల మధ్య గ్రాండ్ గా లాంచ్ చేశారు.
ఇటీవలే అన్స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ రిలీజ్ అయింది. అన్స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు, లోకేష్ వస్తున్నారు అని తెలియడంతో ముందు నుంచి ఈ ఎపిసోడ్ మీద విపరీతమైన హైప్ ఏర్పడింది. ఇప్పటికే అన్స్టాపబుల్ సీజన్ 1 పలు రికార్డులని బద్దలు కొట్టింది. తాజాగా సీజన్ 2 మొదటి ఎపిసోడ్ సరికొత్త రికార్డుని సృష్టించింది.
Manchu Vishnu : నేను ఆదిపురుష్ గురించి అలా అనలేదు.. నెగిటివ్ వార్తలపై స్పందించిన మంచు విష్ణు..
చంద్రబాబు, లోకేష్ వచ్చిన ఈ అన్స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ని 24 గంటల్లో ఏకంగా 10 లక్షల మంది పైగా వీక్షించారు. ఓటీటీ వేదికగా ఇదో సంచలన రికార్డు అని ఆహా టీం అధికారికంగా ప్రకటించింది. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు అని తెలిపింది ఆహా. దీంతో అన్స్టాపబుల్ సీజన్ 2 ఆహా టీం అందరికి మరింత ఎనర్జీ ఇచ్చింది. త్వరలోనే సెకండ్ ఎపిసోడ్ రానుంది.
