Unstoppable With NBK : బాలీవుడ్ మీట్స్ బాలయ్య.. ఆహా అన్‌స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ అనౌన్స్..

త్వరలో రెండో ఎపిసోడ్ రానుంది. ఈ సారి అన్‌స్టాపబుల్ టాలీవుడ్ రేంజ్ దాటి బాలీవుడ్ కి వెళ్ళింది. తాజాగా బాలీవుడ్ మీట్స్ బాలయ్య అని ఓ ఆసక్తికర వీడియోని రిలీజ్ చేసింది ఆహా.

Unstoppable With NBK Season 3 Second episode Bollywood meets Balayya Details Announced By Aha

Unstoppable With NBK : ఆహాలో(Aha) బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 1, సీజన్ 2 రెండూ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించింది. ఇటీవల సీజన్ 3 కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు.

మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు. త్వరలో రెండో ఎపిసోడ్ రానుంది. ఈ సారి అన్‌స్టాపబుల్ టాలీవుడ్ రేంజ్ దాటి బాలీవుడ్ కి వెళ్ళింది. తాజాగా బాలీవుడ్ మీట్స్ బాలయ్య అని ఓ ఆసక్తికర వీడియోని రిలీజ్ చేసింది ఆహా. అన్‌స్టాపబుల్ సీజన్ 3లో రెండో ఎపిసోడ్ కి ఎవరు రాబోతున్నారో ప్రకటించారు ఆహా.

Also Read : Manchu Lakshmi : పేద విద్యార్థులతో మంచు లక్ష్మి దీపావళి సెలబ్రేషన్స్..

అన్‌స్టాపబుల్ సీజన్ 3 రెండో ఎపిసోడ్ లో యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ కపూర్, రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ వంగ రాబోతున్నారు. త్వరలోనే షూటింగ్ జరగనుందని, సినిమా రిలీజ్ ముందే ఈ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తుంది. యానిమల్ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వనుంది. దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా తెలుగు సినిమాలే కాదు అన్‌స్టాపబుల్ షో కూడా బాలీవుడ్ వరకు వెళ్లిందని గర్వంగా ప్రమోట్ చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు