Unstoppable : సెల్ఫ్మేడ్కి సర్నేమ్ నాని.. ఇది చిన్న శాంపిల్ మాత్రమే..
రెండో ఎపిసోడ్ ప్రోమోలో నానితో కలిసి బాలయ్య మామూలు రచ్చ చెయ్యలేదుగా..
- sekhar
- Updated on- November 8, 2021 / 05:58 PM IST
Nani
Unstoppable: నటసింహం నందమూరి బాలకృష్ణ పాపులర్ ఓటీటీ ‘ఆహా’ లో Unstoppable అంటూ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ప్రోమోలతోనే పిచ్చెక్కించిన బాలయ్య.. అంత బాగా హోస్ట్ చేస్తారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అంచనాలను తారుమారు చేశారు. ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు.
Akhanda Title Song : గూస్ బంప్స్ గ్యారంటీ..
ఫస్ట్ ఎపిసోడ్లో మోహన్ బాబు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు సందడి చేశారు. బాలయ్య కూడా వాళ్లను సరదాగా క్వశ్చన్స్ అడిగి అలరించారు. మంచు లక్ష్మీతో ‘దంచవే మేనత్త కూతురా’ పాటకు అదరిపోయే స్టెప్స్ వేశారు. సెకండ్ ఎపిసోడ్‌కి నేచురల్ స్టార్ నాని వస్తున్నాడు. సోమవారం రెండో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.
Unstoppable With NBK : బాలయ్యా.. ఈ అభిమానం నీకే చెల్లునయ్యా.. షో రోడ్ మీద స్క్రీనింగ్!
బాలయ్య ఎప్పటిలానే తన స్టైల్లో ఎనర్జీతో, మేనరిజమ్స్‌తో అదరగొట్టేశారు. ఇక నాని అయితే.. సామాన్యుడిగా సోలోగా వచ్చానంటూ ఇచ్చిన ఇంట్రడక్షన్ సింప్లీ సూపర్బ్. బాలయ్య డైలాగులు చెప్తూ క్రికెట్ ఆడి, బాలయ్యతో కూడా ఆడించాడు నాని. ప్రోమో అంతా సరదాగా సాగిపోయింది.
స్వతాహా నాని, బాలయ్య అభిమాని.. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాలో బాలయ్య డైహార్డ్ ఫ్యాన్‌గా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణతో మంచి అనుబంధం ఉంది నానికి. ఇక వీళ్లిద్దరూ కలిసి చేసే సందడి ఎలా ఉంటుందోనని ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
