Unstoppable With NBK : బాలయ్యా.. ఈ అభిమానం నీకే చెల్లునయ్యా.. రోడ్ మీద షో స్క్రీనింగ్!

అందరిలా ఆలోచిస్తే వాళ్లు బాలయ్య ఫ్యాన్స్ ఎందుకవుతారు?..

Unstoppable With NBK : బాలయ్యా.. ఈ అభిమానం నీకే చెల్లునయ్యా.. రోడ్ మీద షో స్క్రీనింగ్!

Bala

Unstoppable With NBK: నటసింహా నందమూరి బాలకృష్ణ ‘సింహా’ మూవీలో ‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేము’ అని చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ఎవర్ గ్రీన్. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బాలయ్య గురించి అభిమానులు ఈ డైలాగ్ వాడుతుంటారు.

Akhanda Title Song : గూస్ బంప్స్ గ్యారంటీ..

ఆయన ఫ్యాన్స్ చేసే సోషల్ సర్వీస్ కానీ, సినిమా విడుదలప్పుడు చేసే సందడి కానీ ‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’ అన్నట్లుంటాయి. అనకాపల్లి అయినా ఆస్ట్రేలియా అయినా.. పండుగ అయినా.. ప్రోగ్రాం ఏదైనా ‘జై బాలయ్య’ రచ్చ ఉండాల్సిందే. రీసెంట్‌గా బాలయ్య Unstoppable షోతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు.

Balakrishna : మాట నిలబెట్టుకున్న బాలయ్య.. క్యాన్సర్ పేషంట్ కి ఉచిత వైద్యం

ప్రోమోలతోనే పిచ్చెక్కించిన బాలయ్య హోస్ట్ చేసిన ఈ షో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య గెటప్ దగ్గరి నుండి హోస్ట్ చేసిన విధానం వరకు ప్రతీది షో ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఫస్ట్ ఎపిసోడ్‌లో మోహన్ బాబు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు సందడి చేశారు.

Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..

సెకండ్ ఎపిసోడ్‌కి నేచురల్ స్టార్ నాని వస్తున్నాడు. షో ను టీవీలోనో, మొబైల్ లేదా సిస్టమ్‌లో చూస్తారు. అభిమానంతో మహా అయితే థియేటర్లో ప్లే చేస్తారు. ఇలా అందరిలా చేస్తే వాళ్లు బాలయ్య ఫ్యాన్స్ ఎందుకవుతారు? వెరైటీగా చేస్తేనే కదా మజా అంటూ.. Unstoppable With NBK షో ను రోడ్ మీద స్క్రీనింగ్ చేశారు. మరోసారి ఇలా ‘మాకు మేమే పోటీ’ అంటూ బాలయ్య మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు.

NBK : ‘సూర్యవంశీ’ సినిమాలో బాలయ్య బొమ్మ