Unstoppable with NBK : మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు..

‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..

  • Updated on- October 27, 2021 / 05:42 PM IST

Unstoppable With Nbk Show Promo

Unstoppable with NBK : నటసింహా నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ.. బాలయ్య హోస్ట్‌గా సెలబ్రిటీ టాక్ షో.. అసలు ఎలా ఉండబోతుందీ షో.. బాలయ్య గెటప్, స్నీక్ పీక్ చూసి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. లాంచ్ ఈవెంట్‌లో తాను షో లో పాల్గొనడానికి గల కారణాలు చెప్తూ ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ షో మీద అంచనాలు పెంచేశారు బాలయ్య బాబు..

Nandamuri Balakrishna : బ్రహ్మణి గిఫ్ట్ ఇచ్చిన బెంట్లీ కార్‌లో బాలయ్య రాయల్ ఎంట్రీ..

ఆ హైప్‌ని మరింత రెట్టింపు చేస్తూ 30 సెకన్ల నిడివిగల చిట్టి ప్రోమోలతో సోషల్ మీడియాను షేక్ చేసేశారు శ్రఆహా’ టీం. బుధవారం సాయంత్రం ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ షో అఫీషియల్ ప్రోమో రిలీజ్ చేశారు బాలయ్య. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రోమోస్ డైరెక్ట్ చేశారు.

Unstoppable Sneak Peak : కలుద్దాం.. ‘ఆహా’లో.. డిజిటల్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే..

‘మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు’.. ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అంటూ బాలయ్య స్టైల్లో షో ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్. హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, సెట్స్, ప్రాపర్టీస్ దగ్గరినుండి ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటూ బాలయ్య టాక్ షో నెవర్ బిఫోర్ అనేలా రూపొందిస్తున్నారు ‘ఆహా’ టీం.

Unstoppable With NBK : బాలయ్య ఫ్యాన్స్‌తో ‘ఆహా’ ప్రమోషనల్ వీడియో

ఇప్పటికే మంచు ఫ్యామిలీ ముఖ్య అతిథులుగా ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలయ్య షో లో సందడి చెయ్యబోతున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4నుండి తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి.