Unstoppable Sneak Peak : కలుద్దాం.. ‘ఆహా’లో.. డిజిటల్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే..
తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ నెవర్ బిఫోర్ టైపులో నటసింహా నందమూరి బాలకృష్ణతో ఫస్ట్ టైం ఓ టాక్ షో ప్లాన్ చేసింది..

Unstoppable Sneak Peak
Unstoppable Sneak Peak: ఓటీటీలో సరికొత్త సెన్సేషన్.. తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ నెవర్ బిఫోర్ టైపులో నటసింహా నందమూరి బాలకృష్ణతో ఫస్ట్ టైం ఓ టాక్ షో ప్లాన్ చేసింది. ఈ షో కి బి.వి.ఎస్. రవి రైటర్‌గా, అరుణ్ శేష్ కుమార్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Unstoppable With NBK : ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రోమోస్ కట్ చేశారు. గురువారం Unstoppable with NBK షో లాంఛ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ‘అన్‌స్టాపబుల్’ స్నీక్ పీక్ రిలీజ్ చేశారు. బాలయ్య డిఫరెంట్ గెటప్‌లో యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించి అలరించారు.
Unstoppable With NBK : బాలయ్య షో కి భారీ ప్లాన్ వేశారుగా!
‘కలుద్దాం.. ఆహాలో’ అంటూ తన స్టైల్లో చెప్పి షో మీద అంచనాలు ఆకాశాన్నంటేలా చేశారు బాలయ్య. దీపావళి సందర్భంగా నవంబర్ 4నుండి తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ప్రీమియర్ కానుంది. బాలయ్య మొట్టమొదటి సారి టాక్ షో చేస్తుండడంతో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అటు ప్రేక్షకాభిమానుల్లోనూ ఈ షో మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.