Unstoppable With NBK : బాలయ్య ఫ్యాన్స్‌తో ‘ఆహా’ ప్రమోషనల్ వీడియో

‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ కోసం బాలయ్య అభిమానుల చేత భారీ స్థాయిలో ప్రమోషనల్ వీడియో ప్లాన్ చేసింది ‘ఆహా’..

Unstoppable With NBK : బాలయ్య ఫ్యాన్స్‌తో ‘ఆహా’ ప్రమోషనల్ వీడియో

Balakrishna Fans

Updated On : October 16, 2021 / 12:26 PM IST

Unstoppable With NBK: బ్లాక్‌బస్టర్ సినిమాలు, అదిరిపోయే వెబ్‌సిరీస్‌లు, పాపులర్ టాక్ షోలతో డిజిటల్ రంగంలో ప్రథమ స్థానంలో కొనసాగుతుంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’. గత కొద్ది రోజులుగా మీడియా అండ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.

Unstoppable Sneak Peak : కలుద్దాం.. ‘ఆహా’లో.. డిజిటల్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే..

అదే నటసింహా నందమూరి బాలకృష్ణతో ‘ఆహా’ నెవర్ బిఫోర్ టాక్ షో చెయ్యబోతుండడం.. బాలయ్య ఫస్ట్ టైమ్ డిజిటల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందనేది మొన్న జరిగిన లాంఛ్ ఈవెంట్‌లో రిలీజ్ చేసిన ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ స్నీక్ పీక్ చూస్తే తెలిసిపోయింది. సినిమా ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు, బాలయ్య అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఈ టాక్ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Balakrishna : టైసన్ కోసం బాలయ్య..!

ఇప్పుడు ‘ఆహా’ మరో డిఫరెంట్ ప్రోగ్రామ్‌ కండక్ట్ చేస్తుంది. ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ కోసం బాలయ్య అభిమానుల చేత ప్రమోషనల్ వీడియో షూట్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఇందుకోసం చిలుకూరు దగ్గర్లోని చిత్రమందిర్ స్టూడియోలో భారీ ఏర్పాట్లు చేశారు.

Aha

బాలయ్య సినిమాల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ప్రమోషనల్ వీడియోలో బాలయ్య సినిమాల్లోని పాపులర్ పంచ్ డైలాగులు, బాలయ్య బ్లాక్‌బస్టర్ పాటలకు అభిమానుల అదిరిపోయే స్టెప్పులు వంటివన్నీ షూట్ చెయ్యబోతున్నారు. పూరి జగన్నాథ్ ‘పైసా వసూల్’ చివర్లో ‘జైజై బాలయ్య’ అంటూ ఇలాంటి ప్రమోషనల్ సాంగ్ ఒకటి పెట్టారు. ఇప్పుడు ‘ఆహా’ టాక్ షో కోసం భారీ ఎత్తున ప్రమోషనల్ వీడియో చిత్రీకరించనుంది.