The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్‌ని అభినందించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి
తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని చూసి, చిత్ర యూనిట్ ని పిలిచి అభినందించారు. నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.......
- Saketh U
- Published On : March 20, 2022 / 09:33 PM IST
Yogi
The Kashmir Files : ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో నిర్మితమై రిలీజ్ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కేవలం మౌత్ టాక్ తోనే భారీ విజయం సాధించి వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది ఈ సినిమా. 1990లలో పాకిస్థాన్, ఉగ్రవాదులు కలిసి కశ్మీర్ లో హిందువులపై చేసిన మారణకాండ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ‘ది కశ్మీర్ ఫైల్స్’ చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు. నరేంద్రమోడీతో సహా పలువురు సెలబ్రిటీలు, ప్రేక్షకులు ఈ సినిమాని, చిత్ర యూనిట్ ని అభినందిస్తున్నారు.
RRR : గ్యాస్ సిలిండర్ తీసుకోండి.. ‘ఆర్ఆర్ఆర్’ టికెట్లు ఫ్రీగా పొందండి..
చిత్ర యూనిట్ ని సెలబ్రిటీలు అభినందించడమే కాక పలువురు ప్రముఖులు సత్కరిస్తున్నారు. ఇటీవలే హోమ్ మినిష్టర్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్‌ని అభినందించి, స్పెషల్ లంచ్ ఏర్పాటు చేశారు. తాజాగా వరుసగా రెండోసారి ఉత్తరప్రదేశ్ సీఎంగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని చూసి, చిత్ర యూనిట్ ని పిలిచి అభినందించారు. నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, నటులు అనుపమ్ ఖేర్, పల్లవి జోషిలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ ని కలిసి సన్మానించారు. యోగి ఆదిత్యనాథ్ వీరితో కాసేపు సినిమా గురించి మాట్లాడి అభినందించారు.
फिल्म #TheKashmirFiles मजहबी कट्टरता व आतंकवाद की अमानवीय विभीषिका को निर्भीकता से प्रकट करती है।
निःसंदेह यह चलचित्र समाज व देश को जागरूक करने का काम करेगा।
ऐसी विचारोत्तेजक फिल्म निर्माण के लिए पूरी टीम को बधाई देता हूं।@AnupamPKher @vivekagnihotri pic.twitter.com/Bd72cdPFfM
— Yogi Adityanath (@myogiadityanath) March 20, 2022
