Upasana : మెగా కోడలు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ‌పై ఉపాసన కామెంట్స్..

అపోలో సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న ఉపాసన రాజకీయాల్లోకి రాబోతున్నారా..? విజయ్ పొలిటికల్ ఎంట్రీ‌పై ఉపాసన కామెంట్స్ ఏంటి..?

Upasana comments about her and vijay political entry

Upasana : మెగా కోడలు, కామినేని వారసురాలు ఉపాసన గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా మెగా ఇంటిలో కోడలిగా అడుగుపెట్టిన ఉపాసన.. తన వ్యక్తిత్వంతో మెగా ఆడియన్స్ తో పాటు అందరి ప్రశంసలు అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అపోలో సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న ఉపాసన రాజకీయాల్లోకి రాబోతున్నారా..?

రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉపాసనని.. తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆమె స్పందన ఏంటని ప్రశ్నించారు. దీనికి ఉపాసన బదులిస్తూ.. “ఆయన సినిమాల ద్వారా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను. మీకు మార్పు కావాలి అనుకున్నప్పుడు, లీడర్ ఎవరని చూడకుండా సపోర్ట్ చేయండి. లేదు అలా సపోర్ట్ చేయకపోయినా వెనక్కి లాగకండి” అంటూ పేర్కొన్నారు.

Also read : Pushpa : పుష్ప సినిమా మొత్తం మూడు పార్టులుగా రాబోతోందా..!

ఒక కొత్త నాయకుడిని సపోర్ట్ చేసినప్పుడే మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు తమిళనాడులో కూడా వస్తుందని నమ్ముతున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు. కాగా మెగా ఫ్యామిలీ కూడా ప్రస్తుతం పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవి రాజకీయాల్లో కనిపించగా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, నాగబాబు పాలిటిక్స్ లో ముందుకు సాగుతున్నారు. మరి సేవా కార్యక్రమాలతో మంచి అభిమానాన్ని సంపాదించుకున్న ఉపాసన భవిషత్తులో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా..?

ఈ ప్రశ్నకు ఉపాసన సమాధానమిస్తూ.. “రాజకీయాల్లోకి రావడం అనేది మాత్రం జరగదు. కానీ మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నించే నాయకుడికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది” అని చెప్పుకొచ్చారు. ఈ మాటలు బట్టి చూస్తే.. పవన్ కళ్యాణ్ కి ఉపాసన సపోర్ట్ ఫుల్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు